Share News

వైభవంగా భైరవ జయంతి

ABN , Publish Date - Dec 12 , 2025 | 11:24 PM

మండ లంలోని పారుపెల్లి గ్రామంలో భైరవ జయంతి వేడు కలను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. భైరవా ష్టమి సందర్భంగా కాల భైరవస్వామికి ప్రత్యేక అలంక రణ చేశారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషే కాలు, అన్నదాన ప్రసాద వితరణ చేపట్టారు. స్వామి ని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పెద్ద ఎ త్తున పోటెత్తారు.

వైభవంగా భైరవ జయంతి

-వేలాదిగా తరలి వచ్చిన భక్తులు

కోటపల్లి, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : మండ లంలోని పారుపెల్లి గ్రామంలో భైరవ జయంతి వేడు కలను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. భైరవా ష్టమి సందర్భంగా కాల భైరవస్వామికి ప్రత్యేక అలంక రణ చేశారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషే కాలు, అన్నదాన ప్రసాద వితరణ చేపట్టారు. స్వామి ని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పెద్ద ఎ త్తున పోటెత్తారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, హైద్రాబాద్‌, మహారాష్ట్ర, ఛత్తీష్‌గఢ్‌ ప్రాంతాలతో పా టు చుట్టు పక్కల మండలాలు, గ్రామాల నుంచి భక్తు లు భైరవ కొండకు చేరుకున్నారు. స్వామి దర్శనానికి గంటల కొద్ది క్యూలైన్‌లో నిల్చున్నారు. ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. భక్తుల తాకిడి, భైరవ నా మస్మరణతో భైరవ కొండ మార్మోగింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ మధుకర్‌తో పాటు పలువురు ప్రముఖులు స్వామి వారిని దర్శించు కుని పూజలు చేశారు. అలాగే శృంగేరి పీఠ ప్రవచన కర్త బాచంపల్లి సంతోష్‌కుమార్‌ శాస్ర్తి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు ప్రవచనాలను వినిపించారు.

-బాల్క సుమన్‌ప్రత్యేక పూజలు

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ భైరవ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ యన మాట్లాడుతూ ప్రజలందరు ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలిపా రు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం ఏర్పడితే పారుపెల్లి గుట్టపై ఉన్న స్వయంభు కా ల భైరవ స్వామి దేవాలయం అభివృద్ధికి అన్ని విధా లుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Dec 12 , 2025 | 11:24 PM