Share News

దళిత అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ

ABN , Publish Date - May 22 , 2025 | 11:14 PM

దళితుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహానీయుడు భాగ్యరెడ్డి వర్మ అని కలెక్టర్‌ కుమా ర్‌ దీపక్‌ పేర్కొన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్‌లో సమీకృత జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరలో భాగ్యరెడ్డి వర్మ జ యంతిని పురస్కరించుకొని ఎస్సీ కార్పొరేషన్‌ డెవలప్‌మెంట్‌ డీడీ రవీందర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ దుర్గాప్రసాద్‌, అధికారులతో కలిసి భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా ని వాళులు ఆర్పించారు.

దళిత అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ
భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి నివాళులు ఆర్పిస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, మే22 (ఆంధ్రజ్యోతి): దళితుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహానీయుడు భాగ్యరెడ్డి వర్మ అని కలెక్టర్‌ కుమా ర్‌ దీపక్‌ పేర్కొన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్‌లో సమీకృత జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరలో భాగ్యరెడ్డి వర్మ జ యంతిని పురస్కరించుకొని ఎస్సీ కార్పొరేషన్‌ డెవలప్‌మెంట్‌ డీడీ రవీందర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ దుర్గాప్రసాద్‌, అధికారులతో కలిసి భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా ని వాళులు ఆర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి అనగారిన వర్గాల శ్రేయస్సుకోసం కృషి చేశారన్నారు. బా ల్య వివాహాలు, అంటరానితనం, దేవదాసి, జోగిని వ్యవస్థలను రూపు మాపేందుకు పోరాటం చేశారని కొనియాడారు. దళిత ఉద్యమ పితా మహుడిగా, సంఘ సంస్కకర్తగా భాగ్యరెడ్డి ప్రజల గుండెల్లో చిర స్థాయిగా నిలిచారని, సమాజంలో దళితుల చైతన్యం కోసం అహర్ని శలు శ్రమించారన్నారు. మహానుభావుల జయంతి వేడుకలను ప్రభు త్వం అధికారంగా నిర్వహించడం సంతోషకరమని, మహానీయుల చరి త్ర, త్యాగాలను బావి తరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని, దేశ భవిష్యత్తు, ప్రజల సంక్షేమం కోసం మహానీయు లు ఆచరించిన మార్గాలను బావితరాలకు అందిస్తూ ముందుకు తీసు కెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో సంతోష్‌కుమార్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మంచిర్యాలక్రైం: సంఘ సంస్కర్త ఎంవీ భాగ్యరెడ్డి వర్మ సంస్కర ణలు, సేవలు చిరస్మరణీయమని రామగుండం సీపీ అంబర్‌కి షోర్‌ ఝా అన్నారు. భాగ్యరెడ్డివర్మ జయంతి సందర్భంగా సీపీ కార్యాల యంలో నివాళులు ఆర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ సంఘ సంస్కరణకు చేసిన కృషి మరువలేనిదన్నారు. అనేక పో రాటాలు చేశారని, ఆంధ్రసభ స్థాపకుడిగా, హైదరాబాద్‌లో దళిత పాఠశాలను స్థాపించి దళితుల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశా రన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అడ్మిన్‌రాజు, స్పెషల్‌ బ్రాంచీ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్‌ఏసీ ప్రతాప్‌, స్పెషల్‌ బ్రాంచి ఇన్స్‌పెక్టర్‌ పురుషోత్తం, ఆర్‌ఐలు దామోదర్‌, వామనమూర్తి పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2025 | 11:14 PM