Share News

విప్లవ ఉద్యమాలకు దిక్సూచి భగత్‌సింగ్‌

ABN , Publish Date - Sep 28 , 2025 | 11:54 PM

భారత స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్‌ పా లకులను గడగడలాడించిన భారత యువతకు విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన విప్లవ వీరుడు సర్దార్‌ భగత్‌సింగ్‌ అని సీపీఐ రాష్ట్ర కా ర్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాలనరసింహ పేర్కొ న్నారు.

విప్లవ ఉద్యమాలకు దిక్సూచి భగత్‌సింగ్‌
నాగర్‌కర్నూల్‌లో భగత్‌సింగ్‌కు నివాళి అర్పిస్తున్న వివిధ సంఘాల నాయకులు

- సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాలనరసింహ

కందనూలు, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : భారత స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్‌ పా లకులను గడగడలాడించిన భారత యువతకు విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన విప్లవ వీరుడు సర్దార్‌ భగత్‌సింగ్‌ అని సీపీఐ రాష్ట్ర కా ర్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాలనరసింహ పేర్కొ న్నారు. స్థానిక సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆది వారం భగత్‌సింగ్‌ 118వ జయంతిని నిర్వహిం చారు. ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర ఆ కాంక్షను నిలువెల్లా నింపుకుని ఉద్యమం త రంగంగా ఆంగ్లేయులపై ఎగిసిపడిన వీరుడు భగత్‌సింగ్‌ అని కొనియాఆరు. భగత్‌సింగ్‌ త్యా గాన్ని స్ఫూర్తిగా తీసుకుని యువత, విద్యార్థులు సమాజ మార్పుకోసం ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐ వైఎఫ్‌ జిల్లా కార్యదర్శులు బలుముల ప్రేమ్‌కు మార్‌, బిజ్జశ్రీనివాస్‌, ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ జి ల్లా అధ్యక్షుడు నరేష్‌, ఆంజనేయులు, ఏఐవైఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షులు కే.శివకృష్ణ, ఏఐటీయూసీ జి ల్లా కార్యదర్శి మారేడు శివశంకర్‌, సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి రామస్వామి, విద్యార్థి నాయ కులు మన్విత్‌, అఖిల్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2025 | 11:54 PM