Share News

మెరుగైన సేవలు అందించాలి

ABN , Publish Date - Jun 28 , 2025 | 11:17 PM

మె రుగైన వైద్య సేవలు అందించి, జిల్లా ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలని ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్‌కుమార్‌, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పే ర్కొన్నారు. శ

మెరుగైన సేవలు అందించాలి
మెడికల్‌ కాలేజీలో రికార్డులను పరిశీలిస్తున్న ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్‌ కుమార్‌, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

- వైద్య సదుపాయాలపై సమీక్షించిన ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్‌కుమార్‌, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

నాగర్‌కర్నూల్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి) : మె రుగైన వైద్య సేవలు అందించి, జిల్లా ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలని ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్‌కుమార్‌, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పే ర్కొన్నారు. శనివారం జిల్లా ప్రభుత్వ మెడికల్‌ క ళాశాల మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆరోగ్యశ్రీ సీఈవో ఆధ్వర్యంలో కలెక్టర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించి అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వ జనరల్‌ ఆసు పత్రి, వైద్య కళాశాలను వారు పరిశీలించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర మెడికల్‌ కౌన్సి ల్‌ సభ్యులు ప్రత్యక్షంగా మెడికల్‌ కళాశాలను సందర్శించి కళాశాలలో వసతు లు, సౌకర్యాలు, సిబ్బంది, నిర్వ హణాపరమైన అన్ని విభాగా లను పరిశీలించి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించిన విష యాలను కలెక్టర్‌తో కలిసి ప్ర త్యేక సమావేశం నిర్వహించా రు. అనంతరం జిల్లా ప్రభు త్వ జనరల్‌ ఆసుపత్రి సూప రింటెండెంట్‌ చాంబర్‌లో ఆయా విభాగాల అధిపతులతో సమావే శమై అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించా రు. ఒక్కో విభాగం వారీగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, డాక్టర్లు, సిబ్బంది, ఖాళీలు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఇంకా కొత్తగా సమకూర్చాల్సిన సదుపాయాలు తదితర వాటి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌ మార్గదర్శకాలనుగు ణంగా సదుపాయాలు అందుబాటుల ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయా విభాగాల్లో ఖాళీలు ఉంటే వాటి వివరాలను సమర్పించాలని మెడికల్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రమాదేవికి సూచించారు. వీరి వెంట జిల్లా వైద్యారోగ్య శాఖ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ రమాదేవి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రఘు, వైద్య విభాగాల అధిపతులు, వైద్యులు, కళాశాల వైద్య అధ్యాపక బృందం తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 28 , 2025 | 11:17 PM