Share News

గర్భిణులకు మెరుగైన వైద్య సేవలందించాలి

ABN , Publish Date - Dec 24 , 2025 | 11:03 PM

మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని గర్భిణులకు మెరుగైన వైద్య సేవలందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్‌ రవీందర్‌ నాయక్‌ పేర్కొన్నారు. బుధవారం మంచిర్యాలలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని, జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయాన్ని సందర్శించారు.

గర్భిణులకు మెరుగైన వైద్య సేవలందించాలి
మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శిస్తున్న డాక్టర్‌ రవీందర్‌ నాయక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని గర్భిణులకు మెరుగైన వైద్య సేవలందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్‌ రవీందర్‌ నాయక్‌ పేర్కొన్నారు. బుధవారం మంచిర్యాలలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని, జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు వంద శాతం గర్భవతుల నమోదు చేపట్టాలన్నారు. గర్భిణులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి 102 అంబులెన్స్‌ సహకారంతో స్కానింగ్‌ కేంద్రాలకు తరలించాలన్నారు. హైరిస్కు గర్భి ణులను గుర్తించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సాధారణ ప్రసవాలు జరి గేలా చూడాలన్నారు. గ్రామాల్లోని ఆరోగ్య కార్యకర్తలు సాధారణ ప్రసవాలపై గర్భిణు లకు అవగాహన కల్పించాలన్నారు. చిన్న పిల్లల వైద్యులు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా నవ జాత శిశువులకు అందిస్తున్న వైద్య సేవలను పరి శీలించారు. ప్రతి వారంలో రెండు రోజుల పాటు డ్రైడే నిర్వహించి కీటక జనిత వ్యా ధులను తగ్గించుకోవాలన్నారు. వాతావారణ మార్పులతో వచ్చే వ్యాధుల పట్ల అప్రమ త్తంగా ఉండాలన్నారు. ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నందున గర్భిణులు, చిన్న పిల్లలు తగు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం మాతా శిశు కేంద్రం లోని క్యాన్సర్‌ వార్డును సందర్శించి తగు సూచనలు చేశారు. జాతీయ కుష్టు వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా సర్వే కార్యక్రమాన్ని గ్రామాల్లో పకడ్బందీగా నిర్వహిం చాలన్నారు. క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలన్నారు. త్వరగా వ్యాధులను గుర్తిం చి చికిత్స చేయించాలన్నారు. జిల్లాలోని వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో అనిత, జీజీహెచ్‌ డాక్టర్‌ వేదవ్యాస్‌, డాక్టర్‌లు భీష్మ, శ్రీధ ర్‌, శ్రీమన్నారాయణ, సుధాకర్‌నాయక్‌, అరుణ, ప్రసాద్‌, డీపీవో ప్రశాంతి, సీహెచ్‌వోలు పద్మ, వెంకటేశ్వర్లు, సత్తయ్య, నాందేవ్‌, మాస్‌ మీడియా అధికారి వెంకటేశ్వర్‌, విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2025 | 11:03 PM