మెరుగైన వైద్య సేవలు అందించాలి
ABN , Publish Date - Nov 13 , 2025 | 11:00 PM
వైద్య కళాశాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు ఏకాగ్రతతో చదివి సమాజానికి విలువలతో కూడిన మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్
హాజీపూర్, నవంబరు 13(ఆంధ్రజ్యోతి) : వైద్య కళాశాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు ఏకాగ్రతతో చదివి సమాజానికి విలువలతో కూడిన మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో గల ప్రభుత్వ వైద్య కళాశాలలో 2025 సంవత్సరం విద్యార్థులకు ని ర్వహించిన అవగాహన కార్యక్రమానికి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రి న్సిపల్ సులేమాన్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య విద్యార్థులు ఏకాగ్రతతో చదివి సమాజా నికి మంచి వైద్య నైపుణ్యం, విలువలతో కూడిన మెరుగైన వైద్య సే వలు అందించాలని తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థుల కు పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పిస్తామని, వసతి గృహంలో విద్యా ర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలి పారు. డిసెంబర్ 31 నాటికి గుడిపేటలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం రాష్ట్రాన్ని మెడికల్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో జిల్లా కేంద్రంలో 300 కోట్ల రూపా యల అంచనా వ్యయంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, జిల్లాలోని లక్షెట్టిపేట, చెన్నూర్, బెల్లంపల్లి ప్రాంతాలలో సామాజిక ఆరోగ్య కేం ద్రాలు ఏర్పాటుచేసి ప్రతిరోజు దాదాపు 500 మంది ప్రజలకు వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆసుపత్రులు, వైద్య కళాశాల ద్వారా సమీప జిల్లాల నుంచే కాకుం డా పక్క రాష్ట్రాల నుంచి ప్రజలు వైద్య సేవలు పొందుతున్నా రని తెలిపారు. వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల నుంచిప్రజలు మె రుగైన వైద్య సేవలు ఆశిస్తారని, తదనగుణంగా విద్యార్థులు విద్య లో నైపుణ్యం పొందాలని తెలిపారు. పీడియాట్రిషియన్, అనస్తీసియా, ఇతర వైద్య నిపుణులను తయారు చేసి ప్రజలకు సేవలు అందించ డం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. పైవ్రేట్ ఆసుపత్రులు తప్ప నిసరిగా మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కలిఁంచడం జరుగుతుందని, నిరుపేదలకు వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు మెడికల్ కాలేజీ గు డిపేట్‌లో ఉంటే ఆసుపత్రి జిల్లా కేంద్రంలో ఉన్నందున10 కిలోమీ టర్ల ప్రయాణం కోసం రవాణా సౌకర్యంలో భాగంగా బస్సులు ఏర్పా టు చేయాలని ప్రిన్సిపాల్ కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో సం బంధిత అధికారులు, వైద్య విద్యార్ధులు పాల్గొన్నారు. ఈ కార్యక్ర మంలో సంబంధిత అధికారులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.