Share News

మెరుగైన వైద్యసేవలు అందించాలి

ABN , Publish Date - Sep 30 , 2025 | 11:16 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆసు పత్రిలోని పీపీయూనిట్‌లో వ్యాక్సిన్‌ నిల్వలను జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ రవికు మార్‌ మంగళవారం పరిశీలించారు.

మెరుగైన వైద్యసేవలు అందించాలి
చిన్నారులకు వ్యాక్సిన్‌ వేయించడానికి వచ్చిన వారితో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ రవికుమార్‌

- వ్యాక్సిన్‌ నిల్వలను పరిశీలించిన డీఎంహెచ్‌వో రవికుమార్‌

కందనూలు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆసు పత్రిలోని పీపీయూనిట్‌లో వ్యాక్సిన్‌ నిల్వలను జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ రవికు మార్‌ మంగళవారం పరిశీలించారు. ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన ఆసుపత్రిలో రోగులకు అ ందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నా రు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. జిల్లా కేం ద్రంలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో స్వాస్థ్‌ నారి సశక్తి పరివార్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగం గా మంగళవారం నిర్వహించిన సర్జికల్‌ క్యాంపు ను డీఎంహెచ్‌వో రవికుమార్‌ పరిశీలించారు. ప్ర భుత్వ జనరల్‌ ఆసుపత్రిలోని నవజాత శిశు సం రక్షణ కేంద్రాన్ని సందర్శించారు. గర్భవతి ప్రస వించిన 24 గంటల్లోపు శిశువు కు టీకీకరణ చే యించాలని ఆ యన తెలిపారు. ఎన్‌ఐసీయూ లో అడ్మిట్‌ అయిన చిన్నారుల ఆరోగ్య పరిస్థితి గురించి చిన్న పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్‌ నజీముద్దీన్‌ను అడిగి తెలుసు కున్నారు. తదనంతరం పీపీ యూనిట్‌లోని వ్యాక్సిన్‌ నిల్వల ను, రికార్డులను పరిశీలించారు. ఈ శిబిరంలో జనరల్‌ సర్జన్‌ డాక్టర్‌ అనూష 55మంది రోగు లను పరీక్షించి అ వసరమైన మందులను అందజేశారు. ఈ కార్య క్రమంలో డాక్టర్‌ అనూష, డాక్టర్‌ నీరజ్‌, డీవీఎల్‌ ఎం.కుమార్‌, ఫార్మసీ ఆఫీసర్‌, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

ఫ అనంతరం ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో నూతన క్షయవ్యాధి పరీక్షా నిర్ధారణ సీబీనాట్‌ యంత్రాన్ని ప్రారంభించారు. ఎస్‌బీఐ ఆర్థిక సహ కారంతో భవిష్య భారత్‌ ట్రస్ట్‌ వారు ఈ సీబీనా ట్‌ యంత్రాన్ని అందించారు. ప్రజలు జిల్లాను క్షయ రహిత జిల్లాగా చేయాలనే లక్ష్యంతో ఆరోగ్య సిబ్బంది పని చేయాలని డీఎంహెచ్‌వో తెలిపారు. కార్యక్రమంలో గవర్నమెంట్‌ జనరల్‌ ఆసుపత్రి సీఎస్‌ఆర్‌ ఎంవో డాక్టర్‌ రవిశంకర్‌, భవిష్య భారత్‌ జిల్లా మేనేజర్‌ సజ్జత్‌ అలీ, ల్యాబ్‌ టెక్నీషియన్‌ కల్యాణ్‌ కృష్ణారావు, సత్యా రెడ్డి, ఎస్‌టీ ఎస్‌.శ్రీను, ఎస్‌టీఎస్‌ ఎస్‌.రాజ్‌ కుమార్‌, డీవీఎల్‌ ఎం.కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2025 | 11:16 PM