Share News

kumaram bheem asifabad- మెరుగైన వైద్య సేవలు అందించాలి

ABN , Publish Date - Sep 17 , 2025 | 11:15 PM

జిల్లాలోని మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలలో ఒప్పంద ప్రతిపాదికన ఇటీవల నియమించిన 13 మంది వైద్యులకు నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలకు మరింత మెరుగైన వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు జిల్లాలో 13 మంది వైద్యులను నియమించామని అన్నారు.

kumaram bheem asifabad- మెరుగైన వైద్య సేవలు అందించాలి
వైద్యులకు నియామకపత్రాలు అందజేస్తున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలలో ఒప్పంద ప్రతిపాదికన ఇటీవల నియమించిన 13 మంది వైద్యులకు నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలకు మరింత మెరుగైన వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు జిల్లాలో 13 మంది వైద్యులను నియమించామని అన్నారు. వైద్యులు సమయపాలన పాటిస్తూ సేవలు అందించాలని సూచించారు. డెంగీ, మలేరియా, టైఫాడ్‌ వంటి జ్వరాలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మారుమూల గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ అవినాష్‌కుమార్‌, వైద్యులు పాల్గొన్నారు.

వర్షపు నీటిని పొదుపు చేయాలి..

భూగర్భ జలాన్ని అభివృద్ధి చేసేందుకు వర్షపు నీటిని పొదుపు చేయాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కలెక్టరేట్‌లో భూగర్భ నీటి వనరుల శాఖ ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టుకొని భూమిలో ఇంకేలా చర్యలు తీసుకోవాలన్నారు. నీటి వనరుల శాఖ ఆధ్వర్యంలో నీటి పొదుపుపై ప్రత్యేక కార్యచరణ రుపొందించాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలల్లో ఇంకుడు గుంతలు నిర్మించి నీటిని రక్షించి భూగర్భ నీటి మట్టాన్ని పెంపొందించాలని సూచించారు. కార్యక్రమంలో భూగర్భ నీటి వనరుల అధికారి సుహసిని, డీఆర్‌డీవో దత్తారావు, డీపీవో భిక్షపతిగౌడ్‌, నీటిపారుదలశాఖ ఈఈ గుణవంత్‌రావు, మిషన్‌ భగీరథ ఈఈ సిద్దిఖ్‌, ఉద్యానవనశాఖ అధికారి నదీం తదితరులు పాల్గొన్నారు.

పోషణ మాసంపై సమీక్ష..

కలెక్టరేట్‌లో మహిశ శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పోషణ మాసం నిర్వహణపై సంబంధితశాఖల అధికారులతో కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిదో రాష్ట్రీయ పోషణ మాసం 2025లో భాగంగా అక్టోబరు 16వ తేదీ వరకు రోజు వాదీగా నిర్వహించే కార్యక్రమాలను సంబంధితశాఖల అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. పిల్లల్లో ఉబకాయం తగ్గించడం, శిశువులు చిన్న పిల్లల ఆహార పద్ధతులు పోషకాహార ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు ఆరు సంవత్సరంలోపు ఉన్న పిల్లలకు పోషకాహార ఫలితాలను మెరుగు పరచాలని సూచించారు. సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి భాస్కర్‌, డీఆర్‌డీవో దత్తారావు, డీఎంహెచ్‌వో సీతారాం, డీపీవో భిక్షపతిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2025 | 11:15 PM