ఉత్తమ ఫలితాలు అభినందనీయం
ABN , Publish Date - Jul 16 , 2025 | 12:30 AM
ఉమ్మడి నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్(డీసీసీబీ) రాష్ట్రంలోనే ఉత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయమని సహకార, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
సహకార, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డికి అవార్డు ప్రదానం
నల్లగొండ, జూలై 15(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్(డీసీసీబీ) రాష్ట్రంలోనే ఉత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయమని సహకార, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబా ద్‌లోని ఆర్టీసీ ఎక్స్‌రోడ్‌లో ఉన్న నాబార్డు రీజినల్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డికి రాష్ట్ర ఉత్తమ అవార్డు అంద జేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుంభం శ్రీనివాస్‌రెడ్డి బాధ్య తలు చేపట్టిన సంవత్సర కాలంలోనే నల్లగొండ డీసీసీబీని అభివృద్ధి పథంలో నడిపించడం అభినందనీయమన్నారు. అధికారులు, ఉద్యోగులతో చైర్మన్ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడంతో రూ.3వేల కోట్ల టర్నోవర్‌కు వరకు చేరు కుంటుందన్నారు. డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాలోని అందరు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సహకారం తో బ్యాంకును అభివృద్ధి చేస్తున్నామన్నారు. నల్లగొండ డీసీసీబీని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేలా పాలకవర్గం కృషిచేస్తోందన్నారు. రాష్ట్ర ఉత్తమ అవార్డు అందు కోవడంతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. బ్యాంకును అన్నిరంగాల్లో అభి వృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. బ్యాంకు సీఈవో శంకర్రావుకు కూడా అవార్డు అందించారు. ఈ కార్యక్రమంలో అపెక్స్ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రరావు, ఆర్‌సీఎస్ సురేంద్రమోహన్, నాబార్డ్ అధికారి ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.