బెస్ట్ అవైలబుల్ విద్యార్థులకు ఇబ్బందులు రావొద్దు
ABN , Publish Date - Oct 14 , 2025 | 11:07 PM
బెస్ట్ అవైల బు ల్ స్కీమ్ పాఠశాలల్లో చదువు కుంటున్న విద్యార్థుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుం టున్నామని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. ఎ
- కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి) : బెస్ట్ అవైల బు ల్ స్కీమ్ పాఠశాలల్లో చదువు కుంటున్న విద్యార్థుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుం టున్నామని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. ఎక్కడైనా వి ద్యార్థులకు ఇబ్బంది కలిగితే, అ లాంటి పాఠశాల యాజమా న్యాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం రా ష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, రాష్ట్ర ఉన్నతా ఽధికారులతో కలిసి కలెక్టర్లతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరె న్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి బీసీ, ఎస్సీ, మైనార్టీ, ట్రైబల్ కార్పొరేషన్, సంబంధిత శాఖల అధికా రులతో కలిసి కలెక్టర్ బదావత్ సంతోష్ పా ల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జి ల్లాలోని ట్రైబల్ వెల్ఫేర్ శాఖ పరిధిలో మొత్తం 8బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు పని చేస్తున్నా యని, వీటిల్లో 208 మంది విద్యార్థులు అభ్యసి స్తున్నారన్నారు. అదేవిధంగా సామాజిక సంక్షే మ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న 9బెస్ట్ అవైల బుల్ పాఠశాలల్లో 1,159 మంది విద్యార్థులు చ దువుతున్నారని వివరించారు. విద్యార్థుల సంక్షే మం దృష్ట్యా ప్రభుత్వం అందిస్తున్న సదుపా యాలు సక్రమంగా ఉపయోగపడుతున్నాయని పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేవని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఫిరంగి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి గోపాల్‌నాయక్, సాంఘిక సంక్షేమ శాఖ పర్యవే క్షకురాలు రాగమని, కవిత పాల్గొన్నారు.