Share News

kumaram bheem asifabad- సామాన్యులకు ప్రయోజనం

ABN , Publish Date - Sep 19 , 2025 | 09:55 PM

కేంద్ర ప్రభుత్వం కొత్త జీఎస్టీ టారిఫ్‌లను ఈ నెల 22 నుంచి తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో సామా న్య ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. ఈ నెల 22నుంచి పలు రకాల వస్తువులు, వాహనాలపై జీఎస్టీ భారం భారీగా తగ్గుతుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

kumaram bheem asifabad- సామాన్యులకు ప్రయోజనం
లోగో

- రెండు స్లాబులతో వినియోగదారులకు తగ్గనున్న భారం

- వ్యవసాయ ట్రాక్టర్లు, టైర్లు, పురుగు మందుల ధరలు తగ్గింపు

- కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో కొనుగోళ్లకు ఊతం

బెజ్జూరు/చింతలమానేపల్లి, సెప్టెంబరు 19 (ఆంధ్ర జ్యోతి): కేంద్ర ప్రభుత్వం కొత్త జీఎస్టీ టారిఫ్‌లను ఈ నెల 22 నుంచి తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో సామా న్య ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. ఈ నెల 22నుంచి పలు రకాల వస్తువులు, వాహనాలపై జీఎస్టీ భారం భారీగా తగ్గుతుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్లను అప్పటి వరకు వాయిదా వేసుకుంటున్నారు. ప్రధానంగా వాహనాల కొనుగోళ్లలో హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ వంటి నగరాల తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్‌ ఉంది. ఇప్పటికే కొత్త టారిఫ్‌ మూలంగా కొత్త బుకింగ్‌లు నిలిచిపో యాయి. సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల కొనుగోలుపై కూడా ప్రభావం కనబడనుంది. వీటితో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించిన ట్రాక్టర్లు, పురు గు మందులు, నీటిపారుదల శాఖకు సంబంధించిన మోటార్లు, విద్యకు సంబంధించిన పుస్తకాలు,ఇతర వాటిపై కూడా జీఎస్టీ తగ్గింపు ప్రభావం ఉండనుంది. నిత్యావసర వస్తువులపై కూడా జీఎస్టీ తగ్గుతుండ డంతో మధ్యతరగతి ప్రజలు సంతోషపడుతున్నారు. ఈ క్రమంలో 22వ తేదీ వరకు కొనుగోళ్లు నెమ్మదించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

- వివిధ రకాల వస్తువులు..

కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల వస్తువులు, వాహ నాలు, నిత్యావసర సరుకులపై జీఎస్టీని భారీగా తగ్గించింది. ఈ మేరకు సెప్టెంబరు 3వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. దసరాకు 10రోజుల ముందు ఈ నెల 22వ తేదీ నుంచే తగ్గించిన కొత్త జీఎస్టీ అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. దీంతో వెనుకబడిన జిల్లాగా ఉన్న జిల్లా ప్రజలకు ఊరట కలగనుంది. ప్రధానంగా జీఎస్టీల తగ్గింపు ప్రభావం వాహన మార్కెట్‌పై తీవ్రంగా కనిపించ నుంది. ప్రభుత్వం సెప్టెంబరు 3న కొత్త జీఎస్టీ శ్లాబులను ప్రకటించడంతో వాహనాలు కొనుగోలు చేయాలనుకునేవారు ఆలోచనలో పడ్డారు. కొత్త జీఎస్టీలో 28శాతం నుంచి 18శాతానికి వాహనాలపై జీఎస్టీని తగ్గించారు. 10శాతం జీఎస్టీ తగ్గుతుండడం తో వాహనాలు కొనుగోలు చేసేవారు కొత్త టారిఫ్‌ కోసం వేచి చూస్తున్నారు. ప్రధానంగా మధ్యతరగగతి ప్రజలు అధికంగా వినియోగించే 350సీసీలోపు బైకులపై జీఎస్టీని ప్రభుత్వం 28శాతం నుంచి 18శాతానికి తగ్గించింది. పదిశాతం జీఎస్టీ తగ్గుదలతో భారీగా ధరల్లో మార్పు కనిపిస్తుంది. అలాగే 100సీసీ, ఆపై సామర్థ్యం ఉన్న బైకుల ధర రూ.1లక్షకు పైగా ఉన్నాయి. ఇక ఇటీవల ఎక్కువగా క్రేజీ ఉన్న ఎలక్ర్టికల్‌ బైక్‌ల ధర రూ.30వేల నుంచి రూ.లక్షకు పైగా ఉన్నాయి. వీటిపై కూడా 10శాతం జీఎస్టీ తగ్గుదల ఉంది. ప్రతీ నెల సుమారుగా ఐదు వేలకు పైగా బైకుల విక్రయాలు జరుగుతున్నాయి. ఈ లెక్కన బైక్‌ లపై కనిష్టంగా రూ.6వేల నుంచి గరిష్టంగా రూ.25వేల వరకు ధరలు తగ్గనున్నాయి.

- వినియోగదారులకు లబ్ధి..

కేంద్రం భారీగా జీఎస్టీని తగ్గించడంతో సామాన్య ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. పన్ను తగ్గింపు మూలంగా వినియోగదారులకు లబ్దిచేకూరే అవకాశం ఉంది. కేంద్రం ప్రకటనతో ప్రస్తుతం షోరూముల్లో బుకింగ్‌లు భారీగా తగ్గిపోయాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఎక్కువగా పండగ సీజన్లయిన దసరా, దీపావళికి ఎక్కువగా వాహనాలు కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. ఈ క్రమంలో కేంద్రం కూడా పండగల సీజన్‌లోనే భారీగా వాహనాలపై పన్ను తగ్గింపుతో హుషారుగా వాహనాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా కొనుగోలు దారులను ఆకర్శించేందుకు షోరూము నిర్వాహకులు కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ముందుగా బుకింగ్‌ చేసుకొని 22వ తేదీ తర్వాత డెలివరీ చేసుకోవచ్చని ప్రకటిస్తున్నారు. కొన్ని కంపెనీలు 22వ తేదీ నాటికి వర్తించే జీఎస్టీని తీసుకుంటామని హామీ ఇస్తున్నారు. దీంతో ముందస్తుగా బుకింగ్‌ కొనుగోలుదారులు అయోమయంలో పడిపోతున్నారు. మరోవైపు సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలపై కూడా జీఎస్టీ తగ్గింపు ప్రభావం చూపనుంది. బైకులు, కార్లపై 10శాతం తగ్గింపు వస్తుండడంతో పాటు దసరా, దీపావళి ఆఫర్లను ఆయా కంపెనీలు ప్రకటిస్తుండడంతో చాలామంది కొత్త వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌ తీవ్ర నష్టాల వైపు చూస్తుందని నిర్వాహకులు వాపోతున్నారు. ఇక ఆరోగ్యానికి సంబంధించిన డయాగ్నస్టిక్‌ కిట్లు, గ్లూకోమీటర్లు, కళ్లద్దాలు కూడా జీరో జీఎస్టీ పరిధిలోకి రావడం మధ్యతరగతి ప్రజలకు ఊరటగా చెప్పవచ్చు. అలాగే విద్యకు సంబంధించిన మ్యాప్‌ లు, పుస్తకాలు, క్రేయాన్‌లు, ఎరేజర్‌లు, తదితర విద్య, విద్యార్థులకు సంబంధించిన వాటిపై గతంలో ఉన్న 5శాతం, 12శాతం జీఎస్టీని తొలగించి జీరో పరిధిలోకి తీసుకు రావడం పేద విద్యార్థులకు ఊరట కలిగించనుంది. ఎలక్ర్టికల్‌ ఉత్పత్తులతో పాటు నిత్యావసర వస్తువుల పై జీఎస్టీ తగ్గింపు కొనుగోలుదారులకు పెద్ద ఊరట కలిగించే అవకాశంగా చెప్పవచ్చు.

Updated Date - Sep 19 , 2025 | 09:55 PM