పుట్టగొడుగుల్లా బెల్టు షాపులు
ABN , Publish Date - Nov 28 , 2025 | 11:26 PM
జిల్లాలో మధ్యం ఏరులై పారుతోంది. అధికారుల అలసత్వంతో రె చ్చిపోతున్న మద్యం మాఫియా గల్లిగల్లికో బెల్ట్ షాపు ఏ ర్పాటు చేస్తోంది. నివాస గృహాలు, చిన్న చిన్న కిరాణా షాపుల్లోనూ కావలసినంత మద్యం దొరుకుతోంది.
-విచ్చల విడిగా మద్యం అమ్మకాలు
-కిరాణా షాపుల్లో అక్రమ నిల్వలు
-ఎన్నికల వేళ పట్టించుకోని ఎంసీసీ బృందాలు
మంచిర్యాల, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మధ్యం ఏరులై పారుతోంది. అధికారుల అలసత్వంతో రె చ్చిపోతున్న మద్యం మాఫియా గల్లిగల్లికో బెల్ట్ షాపు ఏ ర్పాటు చేస్తోంది. నివాస గృహాలు, చిన్న చిన్న కిరాణా షాపుల్లోనూ కావలసినంత మద్యం దొరుకుతోంది. వైన్, బార్ షాపుల్లో సమయసారిణి ప్రకారం మద్యం లభ్య మవుతుండగా బెల్టు షాపుల్లో మాత్రం 24 గంటలు అం దుబాటులో ఉంటోంది. ఎప్పుడంటే అప్పుడు....ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్ వైన్ షాపుల మాదిరి ఇళ్లలోనే లభ్యం అవుతోంది. కిలో మీటర్లమేర వైన్ షాపు లకు వెళ్లకుం డానే ఐదో, పదో ఎక్కువిస్తే ఇంటి పక్కనే దొరుకుతుం డటం కొసమెరుపు.
వైన్ షాపులకు అనుబంధంగా...
మధ్యం విక్రయాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధా న్యం ఇస్తుండటంతో వైన్ షాపుల నిర్వాహకులు ఇష్టారీ తిగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో వైన్ షాపు పరిధిలో కనీ సం 30 చొప్పున బెల్టు షాపులు అనుబంధంగా పని చే స్తున్నాయంటే అతిశయోక్తికాదు. తమ టార్గెట్లు చేరుకొ నేందుకు బెల్టు షాపులను ఏర్పాటు చేయిస్తూ, అక్రమం గా మద్యం అమ్మకాలు సాగించేలా వైన్ షాపుల నిర్వా హకులే ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వైన్ షాపుల నుంచి ఎమ్మార్పీ ఽధరలకు కొనుగోలు చేస్తున్న బెల్టు షాపుల నిర్వాహకులు ఒక్కో క్వార్టర్ బాటిల్‌పై రూ. 30 అదనంగా వసూలు చేస్తూ అమ్మకాలు సాగి స్తున్నారు. పల్లెల్లో ఎక్కడ చూసినా ప్రతి వాడలో కనీ సం 10 వరకు బెల్టు షాపులు దర్శనమిస్తున్నాయి. బెల్టు షాపుల కారణంగా గ్రామాల్లోని వైన్ షాపుల్లో కూడా గణనీయంగా మద్యం అమ్మకాలు నమోదవుతున్నాయి. పట్టణాల్లో ఒక్కో వైన్ షాపులో సగటున నిత్యం రూ. 5 లక్షల వరకు అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
అక్రమంగా సిట్టింగ్‌లు ఏర్పాటు...
బెల్టు షాపులకు అనుగుణంగా సిట్టింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తూ మందుబాబులను నిర్వాహకులు ఆకట్టు కుంటున్నారు. రెస్టారెంట్ మాదిరిగా అప్పటికప్పుడు ఆ హార పదార్థాలు తయారు చేస్తూ నిర్వాహకులు అందజే స్తున్నారు. బెల్టు షాపుల్లోనూ పోటీ పెరగడంతో తమ కష్టమర్లను ఆకర్శించేందుకు ఇళ్లలోనే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బార్ అండ్ రెస్టారెంట్ల మాదిరిగా బెల్టు షా పుల్లో చికెన్, మటన్, గుడ్లు, ఆమ్లేట్, తదితర ఆహార పదార్థాలను వండి వారిస్తున్నారు.
పట్టించుకోని ఎంసీసీ బృందాలు...
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం, నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభంకాగా, ఎన్నికల అధికారులు ఆంక్షలు సైతం విధించారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ఎంసీసీ) నిబంధనల మేరకు నగదు త రలింపును తనిఖీ బృందాలు అడ్డుకుంటున్నాయి. ప్ర త్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసి మరీ నిఘా ముమ్మ రం చేశాయి. రూ. 50వేలు మించి నగదును తరలిస్తే ఆధారాలు విధిగా సమర్పించాలి. లేనిపక్షంలో నగదును ఎన్నికల అధికారులు సీజ్ చేస్తున్నారు. చెక్ పోస్టుల వ ద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే వదులుతున్నారు. ఎంసీసీ పకడ్బంధీగా అమలు చేస్తు న్నామని చెబుతున్న తనిఖీ బృందాలు మద్యం సరఫరా ను మాత్రం విస్మరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. నిత్యం పెద్ద మొత్తంలో మద్యం వైన్ షాపుల నుంచి తరలిపోతున్నా పట్టించుకునేవారు లేరు. ఎన్నికల దృ ష్ట్యా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కేవలం నగదు మా త్రమే ఉపయోగపడుతుందనే భావనలో అధికారులు ఉ న్నట్లు కనిపిస్తోంది. పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల కోసం నామినేషన్ల దాఖలు ప్రక్రియ అనంతరం ప్రచార సమయంలో ఓటర్లకు పంపిణీ చే సేందుకు ఇప్పటి నుంచే మద్యం తరలించి స్టాక్ పె ట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. దీంతో వైన్ షాపుల యజమానులు సైతం స్టాక్ మొత్తం ఖాళీ చేసే యోచ నలో ఉన్నారు. దీనికి తోడు ఎన్నికలు కలిసి రావడంతో విచ్చల విడిగా బెల్ట్ షాపులకు మద్యం పంపిణీ చేస్తు న్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయం అయినప్పటికీ సంబంధిత అధికారులు మద్యం సరఫరా వైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. అఽధికారుల నిర్లిప్తత కారణంగా బెల్టు షాపుల్లో పెద్ద మొత్తంలో మద్యం నిల్వలు ఉంటున్నాయి. మం దుబాబులకు నేరుగా బెల్టుషాపుల్లో సిట్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అయినా అధికారుల ధృష్టికి రాకపోవడం గమనార్హం.