kumaram bheem asifabad- బెల్టు ఫుల్
ABN , Publish Date - Nov 08 , 2025 | 10:28 PM
ఊరురా మద్యం ఏరులై పారు తోంది, లక్ష్యాల మాటున ప్రధాన దుకాణాల నిర్వహకులు గ్రామాలను పంచుకుంటూ దర్జాగా ఊరుకో మద్యం దుకాణం తరహాలో బెల్టు షాపుల అక్రమ దందాను మూడు, పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా నిర్వహిస్తు రెండు చేతులా ఆర్జిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 15 మండలాల పరిధిలో 38 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఒక్కొ మద్యం దుకాణం పరిధిలో గ్రామానికి రెండు చొప్పున సుమారు వెయ్యికి పైగానే బెల్టుషాపులు కొనసాగుతున్నాయంటే పరిస్థితి ఏ స్థాయి లో ఉందో తెలియజేస్తోంది.
- మద్యం అధిక రేట్లకు విక్రయిస్తున్నా పట్టింపు కరువు
- పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నా మారని వైఖరి
చింతలమానేపల్లి, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఊరురా మద్యం ఏరులై పారు తోంది, లక్ష్యాల మాటున ప్రధాన దుకాణాల నిర్వహకులు గ్రామాలను పంచుకుంటూ దర్జాగా ఊరుకో మద్యం దుకాణం తరహాలో బెల్టు షాపుల అక్రమ దందాను మూడు, పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా నిర్వహిస్తు రెండు చేతులా ఆర్జిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 15 మండలాల పరిధిలో 38 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఒక్కొ మద్యం దుకాణం పరిధిలో గ్రామానికి రెండు చొప్పున సుమారు వెయ్యికి పైగానే బెల్టుషాపులు కొనసాగుతున్నాయంటే పరిస్థితి ఏ స్థాయి లో ఉందో తెలియజేస్తోంది. బెల్టు షాపుల్లో మద్యం విక్రయాలను అరికట్టాల్సిన ఎక్సైజ్ యంత్రాంగం చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడంతో ఈ దందాకు అడ్టుకట్ట పడడం లేదని చెబుతున్నారు. ఫలితంగా ఎక్కడ చూసినా బెల్టు షాపుల దందానే కనిపిస్తోంది. దానికి తోడు బెల్టు షాపులోనే గుడుండా, దేశీదారు వంటి అక్రమ మద్యం కూడా లెక్కకు మిక్కిలి విక్రయాలు సాగుతున్నాయి.
- గుడుంబా తయారీ మానేసిన వారికి..
ఓ వైపు గుడుంబా తయారీ మానేసిన వారికి ప్రభుత్వం స్వయం ఉపాధి మార్గాలతో జీవనోపాధి కల్పిస్తుంటే, మరో వైపు బెల్టు దుకాణాలు పల్లె, పట్టణ ప్రజలను మత్తులో ముంచెత్తుతున్నాయి. నిబంధనలకు వ్యతిరేకంగా గ్రామాల్లో బెల్టు దుకాణాలు కొనసాగుతున్నా.. చర్యలు తీసుకోడవ డంలో అధికార యంత్రాంగం విఫలమవుతుందన్న ఆరోపణలు సర్వత్రా విన్పిస్తున్నాయి. జిల్లాలోని కొందరు మద్యం షాపుల వారే కమీషన్లకు బెల్టు షాపుల నిర్వహణ చేయిస్తున్నారన్న ఆరోపణలున్నా యి. బెల్టు షాపులు ఒక్కరిని చూసి ఒకరు పె డుతూ ఈ దందానే జీవనో పాధిగా చేసుకుంటు న్నారని తెలుస్తోంది. ఉదయం నుంచి సాయం త్రం దాకా ..రాత్రి వేళల్లో సైతం మద్యం అందుబా టులో ఉంచుతూ ప్రజలను మత్తులో ముంచుతు న్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
- మద్యం మత్తులో గ్రామాలు..
ఒకప్పుడు పట్టణ ప్రాంతాల్లోనే పరిమితమైన ఈ దందా ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనూ విచ్చల విడిగా కొనసాగుతోంది. వార్డుకో దుకాణం చొప్పున ఏర్పాటు చేయడంతో గ్రామాల్లో జోరుగా మద్యం దందా సాగతుంది. ఒక్కో గ్రామంలో సుమా రుగా 10 బెల్టు షాపుల వరకు ఉంటాయి. ఇందులో రోజుకు ఒక్కోషాపు నుంచి రూ.5వేల నుంచి 10వేల మద్యం అమ్మకాలు జరిగితే సు మారుగా రోజుకు రూ. 50వేల నుండి లక్ష వరకు మద్యం అమ్మకాలు ఒక్కో గ్రామంలోనే జరుగుతు న్నాయి. జిల్లాలో 33 వైన్స్ షాపులు, మూడు రెస్టారెంట్ బార్లు ఉన్నాయి. 335 గ్రామ పం చాయతీలు, మరో 300 వరకు అనుబంధ గ్రామా లు ఉండగా మద్యం దందా రోజుకు ఏ స్థాయి లో సాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. జిల్లాలో దాదాపు గా వెయ్యికి పైగానే బెల్టు షాపులు నిర్వహిస్తున్నా రని తెలుస్తోంది. బెల్టు దుకాణాల్లో మద్యం బాటిళ్లను ఎంఆర్పీ కంటే రూ. 40నుంచి 60 వరకు ఎక్కువ ధరలకు విక్రయిస్తూ అవసరమైతే మద్యా న్ని కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తు న్నారు. పట్టణాల్లో, గ్రామాల్లో సైతం ఎప్పుడు అవసరమైతే అప్పడు అన్ని వేళల్లో మద్యం లభిస్తోంది. గతంలో టీ తాగడానికి హోటల్‌కు వెళ్లేవారు కాని ప్రస్తుతం ఉదయం లేవగానే బెల్టు దుకాణానికి వెళ్తూ తమ ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ వ్యవహారమంతా అధికా రులకు తెలిసినా బెల్టు దందాపై కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలోని ఉన్నతాధికారులు ఈ దందాపై ప్రత్యేక దృష్టి సారిస్తేనే బెల్టు దందాకు అడ్డుపడడమే కాకండా ప్రజల ఆరోగ్యాలకు రక్షణ కల్పించిన వారవుతారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బెల్టు దందా సాగ కుండా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. పెంచికలపేట, దహెగాం, చింతలమానేపల్లి తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో ఇటీవల గుడుంబా నిషేధిస్తూ గ్రామసు ్థలు తీర్మానాలు చేశారు. మద్యం విక్రయించినా, తాగినా వారిపై చర్యలు తీసుకునేలా ప్రతిజ్జ చేస్తు న్నారు. దీనికి తోడు అధికారులు సైతం గ్రామాల్లో బెల్టు దందాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవా లని ప్రజలు కోరుతున్నారు.