Share News

అంగన్‌వాడీల్లోనూ గంట కొట్టాల్సిందే

ABN , Publish Date - Jun 13 , 2025 | 12:33 AM

బడిలోనే కాదు ఇకపై అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ గంట కొట్టాల్సిందే. 50ఏళ్ల క్రితం గడి యారాలు అంతగా అందరి ఇళ్లలో లేని సమయంలో పాఠశాలకు వెళ్లే సమయం అయిందనే సంకేతంగా బడిలో(బెల్‌) గంట మోగించేవారు. పిల్లలు బడికి వెళ్లేందుకు సన్నద్ధమయ్యేవారు.

అంగన్‌వాడీల్లోనూ గంట కొట్టాల్సిందే
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి-1 అంగన్‌వాడీ కేంద్రంలో గంట కొట్టే విధానాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్‌ త్రిపాఠి (ఫైల్‌)

సీడీపీవోలకు ప్రిన్సిపల్‌ సెక్రటరీ మౌఖిక ఆదేశాలు

తొలిరోజు నార్కట్‌పల్లిలో ప్రారంభించిన కలెక్టర్‌ త్రిపాఠి

నార్కట్‌పల్లి, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): బడిలోనే కాదు ఇకపై అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ గంట కొట్టాల్సిందే. 50ఏళ్ల క్రితం గడి యారాలు అంతగా అందరి ఇళ్లలో లేని సమయంలో పాఠశాలకు వెళ్లే సమయం అయిందనే సంకేతంగా బడిలో(బెల్‌) గంట మోగించేవారు. పిల్లలు బడికి వెళ్లేందుకు సన్నద్ధమయ్యేవారు. కాలం మారుతుండ టంతో వసతుల్లోనూ మార్పులు వచ్చాయి. దీంతో కొన్ని పాఠశాలల్లో మాత్రం ఆధునిక ఏర్పాట్లు చేసుకుని మోగిస్తున్నారు. ఇదీ స్థూలంగా బడిగంటకున్న ప్రత్యేకత. అయితే ఇంత వరకు ఇది ప్రభుత్వ అన్ని పాఠశాలల్లోనూ నిత్యం మోగించడం అందరికీ తెలుసు. కానీ (ప్రీమెట్రిక్‌ వయసు) చిన్నారులు చేరే అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ ’గంట’ కొట్టే మౌఖిక ఆదేశాలందాయి. ఇటీవల శిశు సంక్షేమ శాఖ అధికారులు, సీడీపీవోలతో శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నిర్వహించిన జూమ్‌ మీటింగ్‌లో గంట కొట్టే విధానాన్ని అమలుపర్చాలని మౌఖికంగా ఆదేశాలిచ్చినట్టు ఐసీడీఎస్‌ అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే బుధవారం నార్కట్‌పల్లిలో జరిగిన నూతన చిన్నారుల నమోదు కోసం నిర్వహించిన అమ్మమాట-అంగన్‌వాడీ బాట కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అంగన్‌వాడీ కేంద్రం లోనూ గంట మోగించి ప్రారంభించారు. అంగన్‌వాడీ కేంద్రాలు కూడా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఏ మాత్రం తీసిపోవనే సందేశాన్ని ఇవ్వడం, కూలి పనుల కోసం ఇంటి నుంచి త్వరగా వెళ్లే తల్లులను దృష్టిలో పెట్టుకుని ఈ విధానాన్ని అమలుపరుస్తున్నట్లు భావిస్తున్నా రు. తల్లులు పనిలోకి వెళ్లినా ఇంట్లో ఉండే ఇతరులు అంగన్‌వాడీ కేంద్రంలో వినిపించే గంట శబ్దంతో కేంద్రానికి తీసుకువస్తారనే ఆలోచనతోనే బడిలో మాదిరిగానే అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ గంట మోగించే విధానాన్ని అమలు పరుస్తున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభం గంట, తిరిగి సాయంత్రం 4గంటలకు ఇంటికి వెళ్లే సమయంగా ఆయా లేదా అంగన్‌వాడీ టీచర్లో ఎవరైనా గంటను కొట్టనున్నారు. కాగా అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో కనీస వసతుల కల్పన కోసం కేటాయించిన నిధుల నుంచి గంటలను సమకూర్చు కోవాల్సిందిగా ఆదేశాలున్నట్లు తెలిసింది.

Updated Date - Jun 13 , 2025 | 12:33 AM