అందని.. అత్యవసరం
ABN , Publish Date - Apr 09 , 2025 | 11:34 PM
జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యవ సర వైద్య చికిత్సలకు గ్యారెంటీ లేకుండా పోయింది. కావా ల్సిన వైద్య నిపుణులు, అవసరమైన సాంకేతిక, అధు నాతన వైద్య సామగ్రి అందుబాటులో లేకపో వడం తో ఇతర ప్రాంతాలకు రెఫర్ చేయడం ఇక్కడ నిత్య కృత్యం అయింది.

జిల్లా జనరల్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స కరువు
-ప్రతీ రోజూ పదుల సంఖ్యలో రోగుల రెఫర్
-డెలివరీలకూ ఇతర ప్రాంతాలకు తరలింపు
-ఆసుపత్రిలో వేధిస్తున్న వైద్యుల కొరత
-గాల్లో కలుస్తున్న రోగుల ప్రాణాలు
మంచిర్యాల, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యవ సర వైద్య చికిత్సలకు గ్యారెంటీ లేకుండా పోయింది. కావా ల్సిన వైద్య నిపుణులు, అవసరమైన సాంకేతిక, అధు నాతన వైద్య సామగ్రి అందుబాటులో లేకపో వడం తో ఇతర ప్రాంతాలకు రెఫర్ చేయడం ఇక్కడ నిత్య కృత్యం అయింది. అధృష్టం బాగుండి ఇతర ప్రాంతాలకు సకాలంలో చేరితే సరి....లేదంటే ప్రాణాలు గా ల్లో కలవాల్సిందే. జిల్లా కేంద్రం నుంచి కరీంనగర్, వరంగల్‌తోపాటు హైద్రాబాద్ ప్రాంతాలకు ఇక్కడి రోగులు నిత్యం పదుల సంఖ్యలో వైద్యం కోసం వెళ్లా ల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కేంద్రం నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లాలంటే కనీసం రెండు నుంచి నాలుగు గంటలు పడుతున్నది. ఈ క్రమంలో మార్గ మధ్యలో ప్రాణాలో కోల్పోతున్న వారి సంఖ్య అధికం గానే ఉంటోంది.
రోగులకు భరోసా ఏదీ....?
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితుల్లో రోగులకు భరసా ఇవ్వలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. జిల్లాలో వందల సంఖ్యలో ప్రైవేటు ఆసుపత్రులున్నా పూర్తిస్థాయిలో రిస్క్ తీసుకోలేని పరిస్థితి. మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నెలకొల్పుతున్నా అత్యవసర సమయాల్లో రెం డు, మూడు రోజులకు మించి రోగిని ఉంచుకొని చి కిత్స అందించే ధైర్యం చేయలేకపోతున్నారు నిర్వాహకులు. పూర్తిస్థాయిలో వైద్య పరికరాలు అందుబాటు లో లేకపోవడం...రోగి ప్రాణాలకు ముప్పు వాటిళ్లిన పక్షంలో అతని బంధువుల నుంచి వచ్చే ఇబ్బందు లు దీనికి కారణంగా నిలుస్తున్నాయి. దీంతో ఆ యా ఆస్పత్రుల్లో వైద్యులు చేతులెత్తేస్తున్నారు. అత్యవసర సమయాల్లో రెండు మూడు రోజులు చూసి వెంటనే కరీంనగర్ లేదా హైద్రాబాద్‌కో తరలించి, చేతులు దులుపుకుంటున్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జి ల్లాలకు చెందిన ప్రజలు వైద్యం కోసం అత్యధికంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితోపాటు పలు ప్రైవేటు ఆసుపత్రులపైనే ఆధారపడతారు. రెండు జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని సిరొంచా తాలుకాకు చెందిన ప్రజలు సైతం ఇక్కడికే వస్తుంటారు. అయినప్పటికీ ఇక్కడ వైద్య చి కిత్సలో ఆశించినమేర భరోసా కానరావడం లేదు.
రెఫర్..రెఫర్..రెఫర్
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రితోపాటు, పలు మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్ల లో సైతం పూర్తిస్థాయిలో చికిత్స అందడంలేదు. డెం గ్యూ, గుండె పోటు, తదితర విభాగాల అత్యవసర చికిత్సల కోసం కరీంనగర్, హైద్రాబాద్‌కు వెళ్లాల్సిం దే. డెలివరీలు మొదలుకొని పాము కాటు, హైపర్ టెన్షన్, రోడ్డు ప్రమాదాలు, విద్యుత్‌షాక్, విష ప్రభా వం, తదితర తీవ్రమైన కేసుల్లో ఇతర ప్రాంతాలకు రెఫర్ చేయడం పరిపాటిగా మారింది. ఖర్చులకు వె నకాడని ప్రజలు మల్టీ స్పెషాలిటీ ఆసుత్రుల్లో చేరుతున్నప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో రెండు, మూడు రోజులకంటే ఎక్కువగా స్థానికంగా చికిత్స అందించలేకపోతున్నారు. పరిస్థితి విషమించిందనుకుంటున్న సందర్భాల్లో ఇతర ప్రాంతాలకు రెఫర్ చేస్తున్నారు.
వేధిస్తున్న వైద్యుల కొరత..
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇక్కడ నిత్యం ఓపీ 400పై చిలుకు ఉంటోంది. కేవలం డెలివరీల కో సమే వంద మంది వరకు ఇన్‌పేషెంట్‌గా చేరుతుం టారు. అయితే ఇంత మందికి వైద్య సేవలు అందిం చేందుకు ప్రస్తుతం ఆసుపత్రిలో అవసరమైన అత్య వసర విభాగాల్లో మెడికల్ ఆఫీసర్లు లేరు. జిల్లా ఆ సుపత్రిలో 11 మంది క్యాజువాలిటీ వైద్యులు ఉండా ల్సి ఉండగా, కేవలం ముగ్గురితోనే కాలం వెళ్లదీస్తు న్నారు. అందులోనూ ఇద్దరు వైద్యులు సెలవులపై వె ళ్లగా ప్రస్తుతం ఒక్క మెడికల్ ఆఫీసర్‌పైనే ఆసుపత్రి ఆధారపడి ఉంది. క్యాజువాలిటీ విభాగంలో నిత్యం సగటున 20 వరకు అత్యవసర కేసులు వస్తున్నాయి. క్యాజువాలిటీ విభాగం 24 గంటలపాటు రోగులకు అందుబాటులో ఉండాలి. మూడు షిఫ్ట్‌ల్లో ఒక్కొక్కరు చొప్పున మెడికల్ ఆఫీసర్లు విధుల్లో ఉండాలి. అయి తే ఒక్కరే విధుల్లో ఉండటం వల్ల అత్యవసర విభా గాల్లో రోగులకు సేవలు అందడం లేదు. ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు స్థానిక మెడికల్ కళాశా లలో విధులు నిర్వహిస్తున్న పలువురు వైద్య నిపుణు లకు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో మెడికల్ కళాశాల వైద్య నిపుణులు అదనపు బాధ్య తలు నిర్వహించేందుకు నిరాకరిస్తున్నారు.
ఖాళీలు భర్తీ చేసేందుకు కృషి చేస్తాం...
జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్‌చంద్ర రెడ్డి
ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ల నియామకం కోసం పలు మార్లు నోటిఫికేషన్లు జారీ చేసినప్పటికీ ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో కళాశాల వైద్య నిపుణులకు ఛీఫ్ మెడికల్ ఆఫీసర్లుగా అదనపు బా ధ్యతలు అప్పగించాల్సి వస్తోంది. కనీసం పది మంది చీఫ్ మెడికల్ ఆఫీసర్లను నియమించాల్సి ఉంది. అత్యవసర విభాగాల్లో ఉన్న ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయడం ద్వారా మెరుగైన చికిత్స అందించేం దుకు కృషి చేస్తాం.