kumaram bheem asifabad- స్వాతంత్ర్యోద్యమంలో బీబ్రా ప్రస్థానం
ABN , Publish Date - Aug 14 , 2025 | 11:12 PM
రాష్ట్రంలోని అతి మారు మూల జిల్లా కుమరం భీం ఆసిఫాబాద్. పోరాటాల ఖిల్లాగా సరిహద్దన పెద్దవాగు, ప్రాణహితలే సరిహద్దులుగా... పచ్చని పైర్ల మధ్య కళకళలాడే దహెగాం మండలంలోని అతి చిన్న గ్రామం బీబ్రా. ఈ గ్రామానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉన్నా ఆదరణ లేక నేడు బాహ్యప్రపంచానిక తెలియకుండా పోతోంది. భారతదేశానికి 1947లో స్వాతంత్యం వచ్చినప్పటికీహైదరాబాద్ రాష్ట్రం మాత్రం నిజాం సర్కార్ ఆధీనంలో ఉండడంతో స్వేచ్చను పొందలేక పోయారు.
- ఆదరణలేక మరుగున పడుతున్న చరిత్ర
- తొలి జెండా ఇక్కడే ఆవిష్కరణ
దహెగాం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అతి మారు మూల జిల్లా కుమరం భీం ఆసిఫాబాద్. పోరాటాల ఖిల్లాగా సరిహద్దన పెద్దవాగు, ప్రాణహితలే సరిహద్దులుగా... పచ్చని పైర్ల మధ్య కళకళలాడే దహెగాం మండలంలోని అతి చిన్న గ్రామం బీబ్రా. ఈ గ్రామానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉన్నా ఆదరణ లేక నేడు బాహ్యప్రపంచానిక తెలియకుండా పోతోంది. భారతదేశానికి 1947లో స్వాతంత్యం వచ్చినప్పటికీహైదరాబాద్ రాష్ట్రం మాత్రం నిజాం సర్కార్ ఆధీనంలో ఉండడంతో స్వేచ్చను పొందలేక పోయారు. కానీ భారత స్వాతంత్ర్యోద్యమ కాలంలో బీబ్రా గ్రామంలో నిజాం పోలీసుస్టేషన్ ఉన్నప్పటికీ గ్రామానికి చెందిన బండ మల్లయ్య, గాండ్ల బాపు, తంగిపెల్లి జగ్గయ్య, తనుకు చంద్రయ్య, నాయికిని భీమయ్యతో పాటు మరికొందరు గ్రామస్థులు ఒక వైపు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూనే మరో వైపు స్వాతంత్ర్యోద్యమంలో చురుకైన పాత్రను పోషించారు.
- అర్ధరాత్రి జెండా ఆవిష్కరణ..
దేశానికి స్వాతంత్య్రం రాగానే స్థానిక నిజాం పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించింది. దీంతో స్థానిక స్వాతంత్ర్యోద్యమకారుడి ఇంటి వద్ద గ్రామం నడిఒడ్డున అప్పటికప్పుడు జెండా గద్దెను నిర్మించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అప్పటి నుంచి నేటి వరకు కూడా అదే చోట గ్రామంలో మొట్టమొదటి (ఆగస్టు 15, జనవరి 26)న జెండాను ఆవిష్కరించిన తరువాతనే వేరే చోట్లలో జెండాను ఆవిష్కరించడం ఈ గ్రామంలో అనవాయితీగా వస్తోంది. కాగా ఈ జాతీయ జెండాను మొదటగా బండ మల్లయ్య ఆవిష్కరించగా నేడు ఆయన కుమారుడు బండ సుదర్శన్(వామన్) ఆవిష్కరిస్తుండడం గమనార్హం.
- పెద్దవాగు ఒడ్డున.
బీబ్రా గ్రామంలో నిజాం కాలంలో నిర్మించిన పోలీసు స్టేషన్ పెద్దవాగు ఒడ్డున విశాల ప్రదేశంలో నిర్మించారు. దీని నిర్మాణంలో ఇటుకలు, ఇనుప పట్టీలు పెద్ద పెద్ద రాళ్లతో పాటు డండు సున్నంతో నిర్మించడంతో నేటికీ దీని నిర్మాణం చెక్కు చెదరకుండా ఉంది. పెద్దవాగు వరదల కారణంగా దీనికి వేరే చోటికి మార్చినప్పటికీ మండల వ్యవస్థ ఏర్పడ్డాక దీనిని దహెగాంకు తరలించారు. అలాగే జాతీయ జెండా గద్దె వినియోగించిన కర్ర కూడా నేటికీ సజీవ సాక్ష్యాలుగా చరిత్రను గుర్తు చేస్తున్నాయి. కానీ గతెంతో ఘనంగా దేశ చరిత్రపుటల్లో తమకంటూ ఓ పేరును లిఖించుకున్న బీబ్రా గ్రామం నేడు కళావిహీనంగా తయారైంది. బీబ్రా గ్రామంలో ఉన్న పోలీసు స్టేషన్ నేటి దహెగాం, భీమిని, కన్నెపల్లి, బె జ్జూరు, పెంచికలపేట తదితర మండలాలకు చెందిన సుమారు 100పైగా గామాలు ఈ పోలీసు స్టేషన్ పరిధిలో ఉండేవి. గ్రామంలో మార్వాడీలు, వైశ్యులు పెద్ద మొత్తంలో వస్త్ర, వ్యాపార రంగాలలో ఉండేవారు. ఈ గ్రామం విశాలంగా ఉండి గ్రామంలో వార సంత కూడా ఉండేది. దీంతో ఎలాంటి అవసరాలకైనా బీబ్రా గ్రామానికి నిత్యం చుట్టు పక్కల గ్రామాలకు చెందిన ప్రజలు మంది వివిధ పనుల నిమిత్తం రాకపోకలు సాగిం చేవారు. దీంతో గ్రామం వ్యాపార కేంద్రంగా పేరు పొందింది. కాగజ్‌నగర్ పట్టణ శివారులో పెద్దవాగు రైల్వే వంతనను కూడా బీబ్రా బ్రిడ్జిగానే నేటికీ చెబుతుండడం గమనార్షం.