Share News

శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - May 29 , 2025 | 11:50 PM

శాంతిభద్రతల విషయంలో పోలీసు అధికారులు నిర్లక్ష్యం వహించకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌కిషో ర్‌ఝా అన్నారు. గురువారం కమిషనరేట్‌ కార్యాలయంలో నెలవారి సమీక్షా సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు స్టేషన్‌ డివిజన్‌, జోన్ల వారిగా పెండింగ్‌ కేసులకు సంబంధించిన నేరస్థుల అరెస్టు, దర్యాప్తు సాక్ష్యాధారాల సేకరణ చార్జీషీటుకు సంబంధిం చిన ప్రస్తుత కేసుల స్థితిగతులపై అధికారులను అడిగితెలుసుకున్నారు.

శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలి
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ఝా

రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ఝా

మంచిర్యాలక్రైం,మే29 (ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతల విషయంలో పోలీసు అధికారులు నిర్లక్ష్యం వహించకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌కిషో ర్‌ఝా అన్నారు. గురువారం కమిషనరేట్‌ కార్యాలయంలో నెలవారి సమీక్షా సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు స్టేషన్‌ డివిజన్‌, జోన్ల వారిగా పెండింగ్‌ కేసులకు సంబంధించిన నేరస్థుల అరెస్టు, దర్యాప్తు సాక్ష్యాధారాల సేకరణ చార్జీషీటుకు సంబంధిం చిన ప్రస్తుత కేసుల స్థితిగతులపై అధికారులను అడిగితెలుసుకున్నారు. నమోదైన గ్రేవ్‌కేసులు, మ హిళలపై నేరాలు, పోక్సో కేసులు, గంజాయి, రోడ్డు ప్రమాదాల కేసులకు సంబంధించి సమాచారంతో పాటు కేసుల పరిష్కారానికి ఏవిధంగా చర్యలు తీసుకోవాలో సూచించారు. నేరాల నియంత్రణ కో సం చేపట్టే చర్యలు వివరించారు. చట్టవ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడేవారిపట్ల కఠినంగా వ్యవ హరించాలని దొంగతనాలు నివారించేందుకు అధికారులు నిరంతరంగా అప్రమత్తంగా ఉండాలని, అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టిన చర్యలు బక్రీద్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్‌పో స్టులలో అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని సూచించారు. బక్రీద్‌ సందర్భంగా పీస్‌కమిటీ నిర్వహించాలని సూచించారు. తరుచుగా నేరాలకు పాల్పడే నేరస్తులపై సస్పెక్ట్‌ రౌడ్‌షీట్‌లు తెరు వాలని చట్టవ్యతిరేక కార్యాకలాపాలకు సంబంధించి ముందస్తు సమాచారాన్ని సేకరించాలని సూచిం చారు. ఈ సమావేశంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌ పోలీసు అధికారులు డీసీపీ కరుణాకర్‌, అడి షనల్‌ డీసీపీ అడ్మిన్‌రాజు, స్పెషల్‌ బ్రాంచీ ఏసీపీ మల్లా రెడ్డి, గోదావరిఖని ఏసీపీ రమేశ్‌, మం చిర్యాల ఏసీపీ ఆర్‌. ప్రకాశ్‌, పెద్దపల్లి ఏసీపీ క్రిష్ణ, జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌, ట్రాఫిక్‌ ఏసీపీ శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2025 | 11:50 PM