Share News

ఎన్నికల ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరించాలి

ABN , Publish Date - Dec 01 , 2025 | 11:35 PM

పంచాయతీ ల ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎ న్నికల అధికారి, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు.

ఎన్నికల ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరించాలి

మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

-జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : పంచాయతీ ల ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎ న్నికల అధికారి, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. సోమవారం క లెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారు లకు ఎన్నికల, బ్యాలెట్‌ నిర్వహణ, పోలింగ్‌, కౌంటింగ్‌ అంశాలపై ని ర్వహించిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. నామి నేషన్‌ ప్రక్రియ అనంతరం పోలింగ్‌ కేంద్రాల్లో సదుపాయాలు, ఏర్పా ట్ల పరిశీలన, బ్యాలెట్‌ పేపర్ల నిర్వహణ, ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధి కారులు, సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునేలా చర్యలు తీ సుకోవాలన్నారు. కౌంటింగ్‌ సమయంలో ఎన్నికల నిబంధనలను ఖచ్చి తంగా పాటించాలని, కౌంటింగ్‌ను పారదర్శకంగా నిర్వహించాలన్నా రు. ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశంపై అప్రమత్తంగా ఉం డా లన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహిం చాలన్నారు. మాస్టర్‌ ట్రైనర్లతో పవర్‌ పాయింట్‌ప్రజంటేషన్‌ ద్వారా అందిస్తున్న శిక్షణను సద్వినియోగంచేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎన్నికల అధికారి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు, నోడల్‌ అధికారి శంకర్‌, మాస్టర్‌ట్రైనర్లు హరి ప్రసాద్‌, మధు తదితరులుపాల్గొన్నారు.

Updated Date - Dec 01 , 2025 | 11:35 PM