Share News

సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Dec 02 , 2025 | 11:12 PM

సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్‌ అన్నారు.

సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌

- ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్‌

నాగర్‌కర్నూల్‌ క్రైం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్‌ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాల యంలో ఫ్రాడ్‌ కో ఫుల్‌ స్టాప్‌ పోస్టర్‌ ను ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా సైబర్‌ నేరాలపై ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని ఆయన సూ చించారు. డిసెంబరు 2 నుంచి జనవ రి 12 వరకు ఆరు వారాలు, ఆరు థీమ్స్‌తో అవ గాహన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలి పారు. కాల్‌ ఓటీపీ, కేవీ ఐసీ, మార్ఫింగ్‌ మోసా లకు గురికావద్దని, వెంటనే పోలీసులకు ఫిర్యా దు చేయాలన్నారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌ యాప్‌లు మొదట లాభం చూపి తర్వాత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టించి మోసం చేస్తా యని, అలాంటి మోస పూరిత చర్యల పట్ల ప్ర జలు అప్రమత్తంగా ఉండి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమం లో అడిషనల్‌ ఎస్పీ వెంకటేశ్వర్లు, ఇన్‌స్పెక్టర్‌ ఉపేందర్‌రావు, జిల్లా సైబర్‌ క్రైం టీం, పాలెం యూనివర్సిటీ ప్రిన్సి పాల్‌, విద్యార్థులు, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2025 | 11:12 PM