సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Nov 13 , 2025 | 10:55 PM
ప్రతీ ఒక్కరు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని, కష్టపడి చదివితేనే ఉన్నత స్థాయికి చేరుతారని ఏసీపీ ప్రకాష్ అన్నారు. మంచిర్యాల కార్మెల్ కాన్వెంట్ పాఠశా లలో విద్యార్ధులకు పలు అంశాలపై అవగాహన నిర్వహించారు.
ఏసీపీ ఆర్ ప్రకాష్
మంచిర్యాల క్రైం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి) : ప్రతీ ఒక్కరు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని, కష్టపడి చదివితేనే ఉన్నత స్థాయికి చేరుతారని ఏసీపీ ప్రకాష్ అన్నారు. మంచిర్యాల కార్మెల్ కాన్వెంట్ పాఠశా లలో విద్యార్ధులకు పలు అంశాలపై అవగాహన నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినుల భద్రత, రక్షణకు అధిక ప్రాధా న్యత ఇస్తున్నామని, దీని కోసం మంచిర్యాల జిల్లాలో షీటీం ఏర్పాటు చే శామన్నారు. విద్యార్ధులకు ఈవ్ టీజింగ్, మానవ అక్రమ రవాణా, ట్రాఫిక్ నియమాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, టీ సేఫ్ యాప్, షీటీములపై సమ గ్ర అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఆన్‌లైన్ వేధింపులకు గురైతే వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్య క్రమంలో ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ ఎస్సైలు ఉషారాణి, హైమా, కా నిస్టేబుల్ శ్రీలత, సతీష్ పాల్గొన్నారు.