Share News

kumaram bheem asifabad- వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Jul 24 , 2025 | 10:49 PM

వర్షాకాలం వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వైదులతో మా ట్లాడారు. వైద్యులు, సిబ్బంది స్థానికంగా ఉండి రోగులకు మెరుగైన సేవలు ఆందించాలని సూచించారు

kumaram bheem asifabad-  వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
వైద్యులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

లింగాపూర్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలం వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వైదులతో మా ట్లాడారు. వైద్యులు, సిబ్బంది స్థానికంగా ఉండి రోగులకు మెరుగైన సేవలు ఆందించాలని సూచించారు మందుల కొరత లేకుండా చూసుకోవాలని చెప్పారు. ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలో చేయించుకేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంత రం మండల కేంద్రంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఏఈలకు సూచించారు. వర్షాలు బాగా కురుస్తున్న నేపథ్యంలో వనమహోత్సవంలో భాగంగా మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ భాలికల విద్యాల యంలో మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. విద్యాలయంలో సమస్యలను ఆడగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యామైన భోజనం ఆందించాలని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని సూచించారు. ఆయన వెంట డీఎల్‌పీవో ఉమర్‌హుస్సేన్‌, ఎంపీడీవో రామచందర్‌, ఎంపీవో రజనికాంత్‌, హౌసింగ్‌ ఏఈ శ్రీకాంత్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ అరవింద్‌, మండల విద్యాధికారి శ్రీనివాస్‌, కేజీబీవీ ప్రత్యేకాధికారిణి ప్రసన్నభారతి తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 24 , 2025 | 10:49 PM