Share News

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Nov 06 , 2025 | 11:50 PM

నేటి ప్ర పంచంలో పెరుగుతున్న సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారని, దీనిపై అందరు అప్రమ త్తంగా ఉండాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌ పేర్కొన్నా రు. మందమర్రి పోలీసుల ఆధ్వర్యంలో గురువారం పట్టణం లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు సైబర్‌ మోసాలపై నిర,్వహించిన అవగాహన సదస్సులో ఆ యన పాల్గొని మాట్లాడారు.

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

మందమర్రిటౌన్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : నేటి ప్ర పంచంలో పెరుగుతున్న సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారని, దీనిపై అందరు అప్రమ త్తంగా ఉండాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌ పేర్కొన్నా రు. మందమర్రి పోలీసుల ఆధ్వర్యంలో గురువారం పట్టణం లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు సైబర్‌ మోసాలపై నిర,్వహించిన అవగాహన సదస్సులో ఆ యన పాల్గొని మాట్లాడారు. అపరిచితులు ఫోన్‌లకు పంపించే మె సేజ్‌ లింకులను ఓపెన్‌ చేయవద్దన్నారు. విద్యార్థులు సెల్‌ ఫోన్‌లకు దూరంగా ఉండాలన్నారు. పోలీసు శాఖ సైబర్‌ నే రాలపై అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహి స్తుందన్నారు. ఎవరైనా ఫోన్‌ చేసి బ్యాంకు ఖాతా, ఏటీఎం పిన్‌, ఓటీఈ నెంబర్లు అడిగితే చెప్పవద్దన్నారు. సైబర్‌ మో సాలకు గురైతే వెంటనే 1903కు లేదా పోలీసులకు సమాచా రం అందించాలన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి, ఎస్‌ఐ రాజ శేఖర్‌, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2025 | 11:50 PM