Share News

ఫిర్యాదుదారులతో స్నేహభావంతో మెలగాలి

ABN , Publish Date - Apr 15 , 2025 | 10:44 PM

సమస్యలపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడి వారి సమస్య పరిష్కారానికి తగు సూచనలు, చర్యలు తీసుకోవాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ పేర్కొన్నారు.

ఫిర్యాదుదారులతో స్నేహభావంతో మెలగాలి
జైపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో రికార్డులను పరిశీలిస్తున్న డీసీపీ భాస్కర్‌

జైపూర్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి) : సమస్యలపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడి వారి సమస్య పరిష్కారానికి తగు సూచనలు, చర్యలు తీసుకోవాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ పేర్కొన్నారు. మంగళవారం జైపూర్‌ పోలీస్‌స్టేషన్‌ను మంచిర్యాల ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న పెండింగ్‌ కేసులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల్లో అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌, శ్రీరాంపూర్‌సీఐ వేణుచంద్‌, ఎస్‌ఐ శ్రీధర్‌ ఉన్నారు.

Updated Date - Apr 15 , 2025 | 10:44 PM