పిచికారీలో.. జాగ్రత్త
ABN , Publish Date - Aug 22 , 2025 | 11:45 PM
వ్యవసాయంలో రైతులు ఎదుర్కొనే సమస్యలు అన్నీఇన్నీ కావు. పంట దిగుబడి ఇంటికి చేర్చే వరకు కంటికి రెప్పలా కాపాడు కోవాలి. విత్తనం వేసింది మొదలు కోత కోసే వరకు తె గుళ్లు, పురుగుల బెడద నుంచి రక్షించుకోవాలి. పంటల ను కాపాడే ప్రయత్నంలో రైతులు ప్రాణం మీదికి తె చ్చుకుంటున్నారు.
-నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు
-రసాయణాల స్ర్పేలో అవగాహన అవసరం
-మోతాదుకు మించి వినియోగం వద్దు
-ఒకే సారి మూడు, నాలుగు మందుల వాడకం ప్రమాదకరం
నెన్నెల, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయంలో రైతులు ఎదుర్కొనే సమస్యలు అన్నీఇన్నీ కావు. పంట దిగుబడి ఇంటికి చేర్చే వరకు కంటికి రెప్పలా కాపాడు కోవాలి. విత్తనం వేసింది మొదలు కోత కోసే వరకు తె గుళ్లు, పురుగుల బెడద నుంచి రక్షించుకోవాలి. పంటల ను కాపాడే ప్రయత్నంలో రైతులు ప్రాణం మీదికి తె చ్చుకుంటున్నారు. చీడపీడల నివారణకు ఉపయోగించే క్రిమి సంహారక మందులు పిచికారిలో నిర్లక్ష్యంగా ఉం డటంతో ఏటా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పత్తి పంటలో మందుల స్ర్పే పనులు జోరుగా సాగు తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారు లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
-అవగాహన లోపంతో
రైతులు అవగాహన లోపంతోనే క్రిమిసంహారక మం దులు అధికంగా వినియోగిస్తున్నారు. ఒక్కో చేనులో అ యిదారు సార్లు వివిధ రకాల మందులు కలిపి స్ర్పే చే స్తున్నారు. పత్తి చేలల్లో రెండు సార్లు కలుపు నివారిణి, మరో నాలుగు సార్లు క్రిమిసంహారక మందులు పిచి కారి చేయాల్సి వస్తోంది. ఒక్కో రైతు పదేసి ఎకరాల్లో పత్తి సాగు చేయడంతో తక్కువ కాలంలో ఎక్కువ స్ర్పే చేసేందుకు థైవాన్, చైనా పవర్ స్ర్పేయర్లు వాడుతు న్నారు. ఈ స్ర్పేయర్లతో ఎక్కువ ఒత్తిడితో తుంపర్లు గా మందు పిచికారి అవుతుంది. కొట్టే వారి ఒంటిపై మం దు పడటంతో పాటు కళ్లు, ముక్కు, నోట్లోకి పోతోంది. మందు ప్రభావంతో వెంటనే కంటి సమస్యలు వస్తున్నా యి. అప్పటికి అప్పుడు ఏమి కాకపోయినా మెల్లిమెల్లిగా మందు ప్రభావంతో రోగాలపాలవుతున్నారు. దీంతో మందుల పిచికారీ సమయాల్లో జాగ్రత్తలు పాటించక ఆసుపత్రుల పాలయ్యే వారు అధికం అయ్యారు.
-ఇదీ ’విష’యం..
రసాయణాల్లో కీటక నాశినులు, శిలీంద్రనాశినులు, కలుపు నివారణ మందులు, పూత, కాతకు తోడ్పాటు నిచ్చే ఉత్ర్పేరకాలు ఉంటాయి. వీటిని పిచికారి చేసే సమయంలో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మందుల్లో ఉండే క్రీయాశీలక రసాయణాన్ని బట్టి విష తీవ్రత వివిధ స్థాయిల్లో ఉంటుంది. ఈ విష తీవ్రత ఆధారం చేసుకొని పురుగు మందులను నాలుగు రకా లుగా విభజించారు. మందు డబ్బాపై ముద్రించిన చిహ్నాన్ని చూసి తగిన జాగ్రత్తలు పాటించాలి. చిహ్నం ఎరుపు రంగులో ఉంటే చాలా ఎక్కువ, పసుపు రంగు ఎక్కువ, నీలం రంగు మధ్యస్థం, ఆకుపచ్చ రంగులో ఉంటే తక్కువ విష తీవ్రత ఉన్నట్టు గుర్తించాలి.
-పురుగు మందుల పిచికారిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఫపురగు మందు డబ్బా మూతను నోటితో తీయ రాదు. మందు ద్రావణాన్ని చేతులతో కలుపకూడదు. కర్రను ఉపయోగించి కలుపుకోవాలి.
ఫపవర్ స్ర్పేయర్ నాజిల్‌ను పెద్దగా వెడెల్పు పడే లా చేయరాదు. పిచికారి సన్నగా తుంపర్లుగా పడేలా చూసుకోవాలి.
ఫరెండు లేదా మూడు మందులు కలిపి పిచికారి చేయకూడదు.
ఫచేతులకు తొడుగులు, కంటికి అద్దాలు, ముక్కు, నోటికి మాస్క్ తప్పనిసరిగా ధరలించాలి.
ఫపైరు పెద్దదిగా ఉన్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవ డం ఉత్తమం.
ఫస్ర్పే చేసేటప్పుడు తినడం, తాగడం, పొగతాడం, కళ్లు నలుపుకోవడం, నోటిలో వేళ్లు పెట్టుకోవడం చే యకూడదు.
గాలికి ఎదురుగా స్ర్పే చేయరాదు.
గాయాలైన చేతులతో మందులను తాకరాదు. పిచి కారి పూర్తి అయిన వెంటనే సబ్బుతో స్నానం చే యాలి. ఖాళీ డబ్బాలను నివాస ప్రాంతాలకు దూరంగా పాతిపెట్టాలి.
-ప్రథమచికిత్స:
పిచికారి సమయంలో మందు ప్రభావానికి గురైనప్పుడు తక్షణమే ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించాలి.
కంట్లో మందు పడితే చల్లని నీటితో కడగాలి.
ప్రభావానికి గురైన వ్యక్తి నోట్లో వేళ్లు పెట్టి వాంతి చేయించాలి.
శరీర ఉష్ణోగ్రత పెరిగితే చల్లని నీటితో తుడువాలి. ఉష్ణోగ్రత తగ్గితే దుప్పటి కప్పి వ్చెదనం ఉండేలా చూడాలి.
దుష్ప్రభావానికి కారణమైన రసాయనాల వివరాలను వైద్యులకు తెలపాలి.
ముందు జాగ్రత్తలు పాటించాలి
-పుప్పాల సృజన, మండల వ్యసాయ అధికారి, నెన్నెల
మందులు పిచికారి చేసే సమయంలో రైతులు ముందు జాగ్రత్తలు పాటించాలి. పంట రోగాల బారిన పడితే అధికారులను సంప్రదించి వారు సూచించిన మందులనే తగిన మోతాదులోవాడాలి. అధికంగా వాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ. స్ర్పే చేసేటప్పుడు శరీరం మొత్తం కప్పబడే దుస్తులు, మోఖానికి మాస్కు, చేతులకు తొడుగులు, కళ్లజోడు దరించాలి. స్ర్పే చేసిన చేతులతోనే పొగ తాగడం, గుట్కాలు వేసుకోవడం మం చిది కాదు. గాలికి ఎదురుగా కాకుండా గాలి వాటానికి అనుకూలంగా పిచికారి చేస్తే పంటకు బాగా పడు తుంది. మనిషికి ఇబ్బంది ఉండదు. ఎండకు కాకుండా ఉదయం, సాయంత్రం పూటల్లో పిచికారి చేసుకోవడం శ్రేయస్కరం.