Share News

kumaram bheem asifabad- తస్మాత్‌ జాగ్రత్త

ABN , Publish Date - Oct 24 , 2025 | 10:06 PM

రోజు రోజుకు సైబర్‌ నేరగాళ్ల కేసులు పెరిగి పోతున్నాయి. వీరి ఉచ్చులో పడేందుకు కొంత పంథాలను ఏర్పాటు చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా రైతు కిసాన్‌, ఎస్‌బీఐ పేరిట అందరికి జిల్లాలోని వివిధ వాట్సప్‌ గ్రూపుల్లో లింకులను పం పించారు. ఈ లింక్‌ను క్లిక్‌ చేయగానే సంబంధిత వ్యక్తుల ఫోన్లు హ్యాక్‌ అయ్యాయి. అనంతరం వాట్సాప్‌, ఫెస్‌బుక్‌లో నాకు అత్యవసరంగా డబ్బులున్నాయని, వెంటనే డబ్బులు పే చేయా లంటూ అందరికి మెసేజ్‌లు పంపించారు. జిల్లా పోలీసులు ఈ విషయంలో అందరికి అవగాహణ సదస్సులు పెట్టా

kumaram bheem asifabad- తస్మాత్‌ జాగ్రత్త
లోగో

- క్లిక్‌ చేస్తే చాలు హ్యాక్‌ అవుతున్న సెల్‌ ఫోన్లు

- డబ్బులు కావాలంటూ మెసేజ్‌లు పంపిస్తున్న వైనం

కాగజ్‌నగర్‌ టౌన్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): రోజు రోజుకు సైబర్‌ నేరగాళ్ల కేసులు పెరిగి పోతున్నాయి. వీరి ఉచ్చులో పడేందుకు కొంత పంథాలను ఏర్పాటు చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా రైతు కిసాన్‌, ఎస్‌బీఐ పేరిట అందరికి జిల్లాలోని వివిధ వాట్సప్‌ గ్రూపుల్లో లింకులను పం పించారు. ఈ లింక్‌ను క్లిక్‌ చేయగానే సంబంధిత వ్యక్తుల ఫోన్లు హ్యాక్‌ అయ్యాయి. అనంతరం వాట్సాప్‌, ఫెస్‌బుక్‌లో నాకు అత్యవసరంగా డబ్బులున్నాయని, వెంటనే డబ్బులు పే చేయా లంటూ అందరికి మెసేజ్‌లు పంపించారు. జిల్లా పోలీసులు ఈ విషయంలో అందరికి అవగాహణ సదస్సులు పెట్టారు. తాజాగా కాగజ్‌నగర్‌కు చెం దిన ప్రముఖ డాక్టర్‌కు చెందిన సెల్‌ ఫోన్‌ కూడా హ్యాక్‌ చేసి ఇదే తరహాలో మెసెజ్‌లు పెట్టారు. సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడవద్దని అందరికి అవగాహన కల్పిస్తున్నా కూడా అడపాదడపా సంఘటనలు జరు గుతునే ఉన్నాయి. అయితే బయట చెప్పుకుంటే తమ పరువు పోతోందని కొంత మంది ఏ మాత్రం లీకు చేయటం లేదు. పోనీలే అనుకొని కొత్త సిమ్‌లను మార్చుకుంటున్నా రు. అలాగే ఫేస్‌బుక్‌ ఐడీలను కూడా మార్చే సుకుంటున్నారు. పది రోజుల క్రితం కాగజ్‌నగర్‌ పట్టణానికి రైల్వే అధికారికి అన్‌లైన్‌ సైట్‌ను క్లిక్‌ చేయగానే ఫోన్‌ హ్యాక్‌ అయింది. వెంటనే సంబంధిత వ్యక్తులకు వాట్సప్‌లో బ్యాంకు సాఫ్ట్‌వేర్‌ ను కూడా పంపించారు. వాట్సాప్‌కు సంబంఽధించిన డీపీని కూడా మార్చేశారు. ఈ విషయంలో కొంత మంది దగ్గరి సంబంధికులు నేరుగా ఆ అధికారి ఫోన్‌ చేసి ఈ విషయాన్ని చెప్పారు. వెంటనే సం బంధిత అధికారి తేరుకొని బ్యాంకు సంబంధించిన లావాదేవీలను నిలుపుదల చేసుకోవాల్సి వచ్చింది. ఈ అధికారికి సంబంధించి వాట్సప్‌ గ్రూపుల్లో పూర్తిగా ఎస్‌బీఐ సాఫ్ట్‌ వేర్‌ అప్‌డేట్‌ చేసుకోవాలం టూ మెసేజ్‌లు పెట్డడం విశేషం.

- కొత్త ఆఫర్లతో..

ఇటీవల దీపావళి పండుగ పూట అంటూ ఆన్‌ లైన్‌లో ఫేక్‌సైట్లు పుట్టుకొచ్చాయి. తక్కువ ధరలకే సెల్‌ ఫోన్‌ లభిస్తున్నట్లు ప్రకటనలు చేశారు. దీన్ని చూసి బుక్‌ చేసుకొని ఆన్‌లైన్‌లో పేమేంటు చేసిన తర్వాత సంబంధిత కంపెనీ నుంచి మెసేజ్‌లు రాక పోవడంతో అనుమానం వచ్చిన సంబంధిత వ్యాపారి నేరుగా ఫోన్‌ చేస్తే స్విచ్‌ ఆఫ్‌ రావడంతో అనుమానం వచ్చింది. ఈ విషయంలో తాను మోసపోయినట్టు తెలుసుకున్నారు. సైబర్‌ నేరగాళ్లు కొత్త పంథా ఎంచుకొని రోజు రోజుకు మోసం చేసేందుకు అంతా సిద్దమవుతు న్నారు. కొత్త ఆఫ ర్లతో వచ్చే ఆన్‌లైన్‌ సైట్లను ఎవరు కూడా ఓపెన్‌ చేయరాదని సైబర్‌ నిపుణులు చెబుతున్నారు. అలాగే పీఎం కిసాన్‌, ఆయా బ్యాంకుల సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ అంటూ వచ్చే వాటి విషయంలో పూర్తిగా ముట్టకుండా ఉండడమే ఉత్తమని సూచిస్తున్నారు.

- క్రెడిట్‌ కార్డుల విషయంలోనూ..

క్రెడిట్‌ కార్డులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకు న్న వారికి బ్యాంకు ప్రతినిధులమని మీకు ఓటీపీ వస్తోందని చెప్పి ఆన్‌లైన్‌లో డబ్బులను దోచుకుం టున్నారు. మూడు నెలల క్రితం కూడా పట్టణానికి చెందిన చిరు వ్యాపారికి మీకు క్రెడిట్‌ కార్డు ఉందని, అప్‌డేట్‌ చేస్తున్నామని, మీకు ఓటీపీ వస్తోందని చెప్పి ఏకంగా రూ.90వేలు షాపింగ్‌ మాల్‌లో డబ్బులు చెల్లింపులు చేసుకొని దోచుకు న్నారు. అలాగే గత రెండు నెలల క్రితం కూడా సర్‌సిల్క్‌కు చెందిన ఓ ఉద్యోగికి సంబంధించిన క్రికెట్‌ కార్డులో ఏకంగా రూ.70వేలు దోచుకున్నారు. అలాగే చిరు వ్యాపారికి సంబంధించిన క్రిడిట్‌ కార్డులో కూడా ఇదే తరహాలో డబ్బులు రూ.70 వేలు కొట్టేశారు. క్రెడిట్‌ కార్డుల వివరాలు ఎవరికి కూడా చెప్పరాదని నిపుణులు పేర్కొంటున్నారు.

ఆన్‌లైన్‌ మోసాలపై అవగాహన కల్పిస్తున్నాం..

- వహీదోద్దీన్‌, డీఎస్పీ, కాగజ్‌నగర్‌

ఆన్‌లైన్‌ మోసాలపై అన్ని కళాశాలలో విద్యా ర్థులకు, బస్టాండు, రైల్వే స్టేషన్‌లో అవగాహన కార్యక్రమాలు పెడుతున్నాం. బ్యాంకుకు సంబంధిం చిన అధికారులు ఎవరు కూడా ఫోన్లు చేయరని పదే పదే చెబుతూ వివరిస్తున్నాం. అయినా కొంత మంది తప్పుడు సైట్‌ను క్లిక్‌ చేస్తున్నారు. క్రెడిట్‌ కార్డుల విషయంలో ఎలాంటి సమాచారం ఇవ్వకూ డదు. సమాచారం ఇస్తే ఆన్‌లైన్‌ చెల్లింపులు జరిగి డబ్బు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.

Updated Date - Oct 24 , 2025 | 10:06 PM