Share News

సైబర్‌ నేరాలభారిన పడకుండా జాగ్రత్త పడాలి

ABN , Publish Date - Oct 27 , 2025 | 10:19 PM

ప్రతీ ఒక్కరు సైబర్‌ నేరాల భారీన పడకుండా జాగ్రత్తగా ఉం డాలని, పోలీసుల విధులపై విద్యార్ధులు అవగాహన కలిగి ఉండాలని రామగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిషో ర్‌ ఝా అన్నారు. సోమవారం పోలీసు అమర వీరుల సం స్మరణ దినోత్సవం సందర్భంగా విద్యార్ధుల కోసం రామ గుండం పోలీసు కమిషనరేట్‌లో పోలీసు ఓపెన్‌ హౌజ్‌ ని ర్వహించారు.

సైబర్‌  నేరాలభారిన పడకుండా జాగ్రత్త పడాలి
ఓపెన్‌హౌజ్‌లో విద్యార్ధులతో సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా

సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా

మంచిర్యాల క్రైం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : ప్రతీ ఒక్కరు సైబర్‌ నేరాల భారీన పడకుండా జాగ్రత్తగా ఉం డాలని, పోలీసుల విధులపై విద్యార్ధులు అవగాహన కలిగి ఉండాలని రామగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిషో ర్‌ ఝా అన్నారు. సోమవారం పోలీసు అమర వీరుల సం స్మరణ దినోత్సవం సందర్భంగా విద్యార్ధుల కోసం రామ గుండం పోలీసు కమిషనరేట్‌లో పోలీసు ఓపెన్‌ హౌజ్‌ ని ర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్ధుల్లో చట్టపర అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వ హించామన్నారు. చట్టాల గురించి, పోలీసు విధులపై, భరో సా సెంటర్‌ గురించి, కమ్యునికేషన్‌ సిస్టం గురించి, ఫింగర్‌ ప్రింట్‌ డివైజ్‌ల వల్ల కలిగే ఉపయోగాలు, ట్రాఫిక్‌, తదిత ర అంశాలపై విద్యార్ధులకు వివరించారు. పోలీసులు ఉప యోగిస్తున్న సాంకేతికత గురించి అవగాహన కల్పించారు. పోలీసు వీరుల త్యాగాలు మరువలేనివన్నారు. మహిళలు, బాలికలు రక్షణకు ఏర్పాటు చేసిన భరోసా కేంద్రం గురించి, వాటి పని తీరు, వివిధ యాప్‌ల గురించి అవగాహన క ల్పించారు. ఏ సమస్య తలెత్తినా 100కు డయల్‌ చేస్తే తక్ష ణమే పోలీసులు స్పందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో అడి షనల్‌ డీసీపీ శ్రీనివాస్‌, ట్రాఫిక్‌ ఏసీపీ శ్రీనివాస్‌, ఏఆర్‌ ఏ సీపీ ప్రతాప్‌, సైబర్‌ క్రైం ఏసీపీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2025 | 10:19 PM