సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకే పెద్దపీట...
ABN , Publish Date - Dec 19 , 2025 | 10:51 PM
పంచా యతీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా వెనుకబడ్డ కులస్థులు అత్యధిక స్థానాల్లో గెలుపొందడం ద్వారా తమ ఉనికిని మరోసారి నిరూపించుకున్నారు.
-జనరల్ స్థానాల్లో వారికే ఎక్కువ సీట్లు
-91 స్థానాల్లో జెండా ఎగురవేసిన బీసీలు
-రిజర్వేషన్ కోటా కింద మరో 23 స్థానాలు
-జిల్లాలో 114 సీట్లు కైవసం
-మొత్తంగా 38 శాతం స్థానాల్లో పాగా
మంచిర్యాల, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): పంచా యతీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా వెనుకబడ్డ కులస్థులు అత్యధిక స్థానాల్లో గెలుపొందడం ద్వారా తమ ఉనికిని మరోసారి నిరూపించుకున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చే యాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి హై కోర్టు బ్రేకులు వేసిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండ కూడదన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బీసీ రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని కొం దరు హై కోర్టులో సవాల్ చేశారు. హై కోర్టు కూడా అ దే అంశాన్ని ప్రస్తావిస్తూ 42 శాతం అమలు చేయడా న్ని వ్యతిరేకించింది. దీంతో ప్రత్యామ్నాయ చర్యలు చే పట్టిన రాష్ట్ర ప్రభుత్వం అన్ రిజర్వ్‌డ్ స్థానాల్లో బీసీలకు పెద్దపీట వేయాలని నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. అయితే ముందుగా నిర్ణయించినట్లు 42 శాతం రిజర్వేష న్లు కాకుండా ఆ సంఖ్యకు దగ్గరగా ఉండేలా జనరల్ స్థానాలను ఆ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు కేటాయించేలా నిర్ణయించినట్లు తెలుస్తోంది. వెనుకబడ్డ కులస్థులకు రిజర్వేషన్లు అధికారికంగా అమలు చేయ డం కష్టసాఽధ్యమైన నేపథ్యంలో...పార్టీ పరంగా ఆ మే ర కు అవకాశం కల్పించినట్లు సమాచారం.
జనరల్ కేటగరీలో బీసీలకు అవకాశం....
సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఆధారంగా అన్ని కేటగరీల రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూడదన్న నిబం ధన ఉంది. రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర కులగణన సర్వే ప్రకారం బీసీలు 50 శాతానికి పైగా ఉండటంతో, జనా భా దామాషా రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఆ సామాజిక వర్గానికి చెందిన వారికి 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న విష యం తెలిసిందే. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మిం చి ఉండరాదన్న సుప్రీం కోర్టు ఆదేశాలతో పునరా లో చనలో పడ్డ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జనరల్ కేటగరీలో అవకాశం కల్పి స్తూ నిర్ణయం తీసుకుంది. అధికారికంగా బీసీలకు 23 శాతం రిజర్వేషన్లు కల్పించగా, మిగతా స్థానాలకు జనర ల్ కేటగరీ నుంచి అవకాశం కల్పించారు.
జనరల్‌కు 44.8 శాతం సీట్లు....
జిల్లాలోని 306 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు ని ర్వహించగా, వాటిలో ఏజెన్సీ పంచాయతీలు 35 ఉన్నా యి. వాటితోపాటు నాన్ ఏజెన్సీ కింద మరో 268 గ్రామ పంచాయతీలు ఉండగా, ప్రత్యేకంగా షెడ్యూల్ ట్రైబ్ జీ పీలు మూడు ఉన్నాయి. జిల్లాలోని మొత్తం 306 పం చాయతీల్లో జనాభా దామాషాన వివిధ వర్గాలకు సీట్లు కేటాయించారు. సర్పంచ్ స్థానాల్లో ఎస్టీ కేటగిరీకి 21.2 శాతం కోటా కింద మొత్తం 65 సీట్లు కేటాయించారు. అలాగే ఎస్సీ కేటగరీలో 26.5 శాతం కింద 81 స్థానాలు, బీసీ కేటగరీలో 7.5 శాతంతో 23 సీట్లు కేటాయించారు. అలాగే అన్ రిజర్వుడ్ కోటాలో 44.8 శాతంతో మరో 137 సీట్లు కేటాయించారు. అదే మాదిరిగా వార్డు సభ్యు ల స్థానాల్లోనూ బీసీలకు అత్యధిక స్థానాలు కల్పించారు. జిల్లాలోని 2680 వార్డు స్థానాలకు గాను ఏజెన్సీ ఏరి యాలో 204, నాన్ ఏజెన్సీ ఏరియాలో 2452 స్థానాలు ఉండగా, వంద శాతం ఎస్టీ వార్డులు 24 ఉన్నాయి. మొత్తం వార్డుల సంఖ్యలో ఎస్టీలకు 17 శాతం రిజర్వేష న్ కింద 457 స్థానాలు, 22 శాతం రిజర్వేషన్‌తో ఎస్సీ లకు 599, బీసీలకు 12.4 శాతం రిజర్వేషన్‌తో 334 స్థా నాలు కేటాయించగా, 48.13 శాతంతో జనరల్ కేటగరీకి 1290 సీట్లు రిజర్వ్ చేశారు.
38 శాతం సీట్లు బీసీల కైవసం...
పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు జిల్లాలో మొత్తంగా 38 శాతం సీట్లు దక్కాయి. అధికారికంగా ఆ సామాజిక వర్గానికి 7.5 శాతం రిజర్వేషన్ కింద 23 సీట్లు కేటా యించారు. అలాగే జిల్లాలో జనరల్ కేటగరీకి 44.8 కిం ద 137 స్థానాలను కేటాయించారు. వీటిలో బీసీలకు కే టాయించిన 23 సీట్లతోపాటు జనరల్ కేటగరీ నుంచి మరో 91 స్థానాలను బీసీలు కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలో బీసీలు మొత్తంగా 114 సర్పంచ్ సీట్లను గెలు చుకోగా, 37.74 శాతం స్థానాల్లో ఆ సామాజిక వర్గం నాయకులు పాగా వేశారు. ఈ లెక్కన బీసీలకు అనధి కారికంగా దాదాపు 38 శాతం రిజర్వేషన్ అమలు చేసిన ట్లయింది. బీసీలు గెలిచిన జనరల్ కేటగరీ స్థానాల్లో అధికార కాంగ్రెస్ సహా బీఆర్‌ఎస్, బీజేపీలు బలపరిచిన అభ్యర్థులు ఉండటంతో.... అన్ని ప్రధాన పార్టీలు ఆ సా మాజిక వర్గానికే పెద్దపీట వేశాయన్న ప్రచారం పల్లెల్లో జోరుగా జరుగుతోంది.