Raj Bhavan Protest Over Reservation Bill: ఆ బిల్లు ఆమోదించకపోతే రాజ్‌భవన్ ముట్టడి
ABN , Publish Date - Sep 29 , 2025 | 04:02 AM
బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని గవర్నర్ ఆమోదించ ని పక్షంలో రెండు రోజుల్లో రాజ్‌భవన్ ముట్టడి చేపడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ...
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల
హైదరాబాద్, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని గవర్నర్ ఆమోదించ ని పక్షంలో రెండు రోజుల్లో రాజ్‌భవన్ ముట్టడి చేపడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. బీసీలపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు కేసు దరిమిలా తక్షణం కిషన్ రెడ్డి, రామచందర్రావు గవర్నర్‌తో భేటీ కావాలన్నారు. బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని గవర్నర్ ఎందుకు ఆమోదించడం లేదని జాజుల ప్రశ్నించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లను గవర్నర్ తక్షణమే ఆమోదించాలని కోరారు. గవర్నర్‌పై ఒత్తిడి పెంచడానికి తమ ప్రతినిది బృందం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును కలుస్తుందన్నారు. బీసీలపై అగ్రకులాల కుట్రలను ఎండగట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని జాజుల చెప్పారు.