BC Welfare Society MP R Krishnayya: 10న చలో ఢిల్లీ.. ఓబీసీ జాతీయ సదస్సు
ABN , Publish Date - Dec 01 , 2025 | 05:34 AM
బీసీలకు చట్టసభల్లో 50ు రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, క్రీమీలేయర్‌ను పూర్తిగా రద్దు చేయాల....
బీసీలకు 50ు రిజర్వేషన్లు కల్పించాలి: ఆర్.కృష్ణయ్య
బర్కత్‌పుర, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): బీసీలకు చట్టసభల్లో 50ు రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, క్రీమీలేయర్‌ను పూర్తిగా రద్దు చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం డిసెంబరు 10న చలో ఢిల్లీ, ఓబీసీ జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య వెల్లడించారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీల అభివృద్ధికి 2 లక్షల కోట్ల రూపాయలతో ప్రత్యేక పథకాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో నిర్వహించనున్న ఓబీసీ జాతీయ సదస్సుకు 8 మంది కేంద్రమంత్రులు, వివిధ పార్టీలకు చెందిన 20 మంది ఎంపీలు పాల్గొంటారని పేర్కొన్నారు. జనవరి చివరి వారంలో పరేడ్‌గ్రౌండ్‌లో 5 లక్షల మందితో నిర్వహించే బీసీ సభకు ప్రధాని మోదీని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.