Jajula Srinivas Goud: బీసీ వ్యతిరేక బీజేపీని భూస్థాపితం చేద్దాం: జాజుల
ABN , Publish Date - Aug 07 , 2025 | 04:02 AM
బీజేపీ.. బీసీలకు వ్యతిరేకం అని, ఆ పార్టీని భూస్థాపితం చేద్దాం అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీజేపీ కథ ముగియనుంది అని చెప్పడానికి..
న్యూఢిల్లీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): బీజేపీ.. బీసీలకు వ్యతిరేకం అని, ఆ పార్టీని భూస్థాపితం చేద్దాం అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీజేపీ కథ ముగియనుంది అని చెప్పడానికి.. ఢిల్లీలోని మహాధర్నానే నిదర్శనమన్నారు. రాష్ట్రపతి కార్యాలయంపై మోదీ ఒత్తిడి తీసుకొచ్చి ఆర్డినెన్స్ రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లు ఇవ్వని బీజేపీ మనకు అవసరామా? అని ప్రశ్నించారు. ‘బీజేపీ హటావో బీసీ రిజర్వేషన్ బచావో’ నినాదంతో బీసీలు ముందుకెళ్లాలన్నారు. కిషన్ రెడ్డి కిరికిరి రెడ్డి అని.. బండి సంజయ్ తొండి సంజయ్ అని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు న్యాయవాది కాదు అన్యాయవాది అని విమర్శించారు. వీరంతా బీసీ వ్యతిరేక విధానాలు మానుకోవాలన్నారు. ఇంటి దీపం అని ముద్దాడితే మూతి కాలిందన్నట్లుగా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.