బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడాలి
ABN , Publish Date - Oct 22 , 2025 | 10:59 PM
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధన కోసం పోరాటం చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా కన్వీనర్ నిరంజన్ ముదిరాజ్ అన్నారు.
- బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా కన్వీనర్ నిరంజన్ ముదిరాజ్
అచ్చంపేటటౌన్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధన కోసం పోరాటం చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా కన్వీనర్ నిరంజన్ ముదిరాజ్ అన్నారు. ఈ నెల 24న జస్టిస్ ఈశ్వరయ్య, డాక్టర్ విశారదన్ మహారాజ్ సారథ్యంలో 42శాతం బీసీ రిజర్వేష న్ల చట్టాన్ని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని కోరుతూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని బుధవారం పట్టణంలోని విలేకర్ల స మావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబా ద్‌లోని ఇందిరాపార్క్‌లో నిర్వహించే మహాధర్నా కు జిల్లా నుంచి పెద్దఎత్తున పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులుసాయి, సురేష్, శ్రీధర్, లింగం, వీరయ్య పాల్గొన్నారు.
తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన
కల్వకుర్తి, (ఆంధ్రజ్యోతి) : బీసీ లకు పంచాయతీ నుంచి పార్ల మెంట్ వరకు 42శాతం రిజర్వేష న్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కల్వకుర్తి తహసీల్దార్ కార్యాలయం ముందు బీసీ జేఏసీ నాయకులు నిరసన తెలిపారు. బీసీలకు 42 శాతం కల్పించాలని కోరుతూ డిప్యూటీ తహసీ ల్దార్ అనితకు బీసీ జేఏసీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. నాయకులు మాట్లాడు తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలయాపన చే యకుండా పార్లమెంట్‌లో బీసీ 42శాతం రిజర్వే షన్ల అమలు చట్టబద్ధ కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలరిజర్వేషన్లు సాధించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు సదానందంగౌడ్, రాజేందర్, శ్రీనివాసులు, భగత్ సింగ్, పాండుగౌడ్, గోపాల్, సుధాకర్, రామ కృష్ణ, గణేష్, రుక్కుల్‌గౌడ్, వెంకటేశ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.