Share News

kumaram bheem asifabad-బీసీ జేఏసీ బంద్‌ ప్రశాంతం

ABN , Publish Date - Oct 18 , 2025 | 11:15 PM

బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ చట్ట భద్దత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంద్‌ పిలుపులో బాగంగా ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ బంద్‌ సంపూర్ణంగా ప్రశాంతంగా జరిగింది. బీసీ జేఏసీ ఛైర్మన్‌ రూప్‌నార్‌ రమేష్‌ ఆధ్వర్యంలో పట్టణంలో రెండు రోజుల నుంచి ప్రతి సంఘాల నాయకులను కలిసి బంద్‌కు సహకరించాలని కొరగా స్వచ్చందంగా వ్యాపార, వాణిజ్య సముదాయలను మూసి వేసి వ్యాపారులు బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారు. బంద్‌ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి

kumaram bheem asifabad-బీసీ జేఏసీ బంద్‌ ప్రశాంతం
ఆసిఫాబాద్‌లో డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

- డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

- జిల్లా కేంద్రంలో బీసీ నాయకుల రాస్తారోకో

ఆసిఫాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ చట్ట భద్దత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంద్‌ పిలుపులో బాగంగా ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ బంద్‌ సంపూర్ణంగా ప్రశాంతంగా జరిగింది. బీసీ జేఏసీ ఛైర్మన్‌ రూప్‌నార్‌ రమేష్‌ ఆధ్వర్యంలో పట్టణంలో రెండు రోజుల నుంచి ప్రతి సంఘాల నాయకులను కలిసి బంద్‌కు సహకరించాలని కొరగా స్వచ్చందంగా వ్యాపార, వాణిజ్య సముదాయలను మూసి వేసి వ్యాపారులు బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారు. బంద్‌ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. బస్టాండు ఎదుట బీసీ సంఘం నాయకులు బస్సులు బయటికి వెళ్లనీయకుండా రాస్తారొకో నిర్వహించారు. దీంతో మధ్యాహ్నం వరకు డిపో నుంచి ఒక్క బస్సు కూడ బయటకు వెళ్లలేదు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లె ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌పై చట్ట భద్దత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ బీసీ సంఘాల నాయకులు అంబేద్కర్‌చౌక్‌ ఎదుట ధర్నా రాస్తారొకో చేపట్టారు. అలాగే సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో బంద్‌కు మద్దతు తెలిపి పట్టణంలో మోటార్‌ సైకిల్‌ ర్యాలీని నిర్వహించారు. బంద్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకొకుండా సీఐ బాలాజీ వరప్రసాద్‌ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల, అయా పార్టీల నాయకులు శ్యాంనాయక్‌, బాలేశ్వర్‌గౌడ్‌, గాదవేణి మల్లేష్‌, మంగ, ప్రణయ్‌, విశాల్‌, శంకర్‌, జీవన్‌, ఆలీబీన్‌ ఆహ్మద్‌, బద్రీ సాయి, చిరంజీవి, దినకర్‌, కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): బీసీ సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్‌ శనివారం కాగజ్‌నగర్‌ పట్టణంలో విజయవంతం అయింది. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు తుమ్మ రమేశ్‌ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. బంద్‌కు బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎమ్మార్పీఎస్‌, సీపీఎం, సీపీఐ నాయకులు, సీనియర్‌ సిటిజన్‌, వ్యాపారులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు డాక్టర్‌ శ్రీనివాస్‌, నాయకుల దస్తగిరి, శ్యాంరావు, సత్యనారాయణ, వెంకటేష్‌, రమేష్‌, తిరుపతి, నాగేశ్వర్‌రావు, రమణయ్య, షబ్బీర్‌ హుస్సేన్‌, మల్లయ్య, మెహరాజ్‌, మల్లేష్‌, శ్రీనివాస్‌, మనోహర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, శంకర్‌, విజయ్‌సింగ్‌, ఇస్తారు, తదితరులు పాల్గొన్నారు.

చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): బీసీలు తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్‌ శనివారం చింతలమానేపల్లి మండలంలో విజయవంతం అయింది. మండలంలోని వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు బంద్‌ పాటించాయి. బీసీ సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో దుకాణాలను మూసి వేయించారు. దీంతో మండలంలో బంద్‌ ప్రశాంతంగా జరిగింది. ఎస్సై నరేష్‌ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటన చోటు చేసుకోకుండా చూశారు.

దహెగాం, (ఆంధ్రజ్యోతి): బీసీలు తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్‌లో భాగంగా శనివారం దహెగాం మండలంలో బంద్‌ ప్రశాంతంగా విజయవంతం అయింది. మండలంలోని వాణిజ్య సముదాయాలు, పాఠశాలలను బీసీ సంఘాల ఆధ్వర్యంలో మూసి వేయించారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా సీఐ కుమారస్వామి, చర్యలు చేపట్టారు.

పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): బీసీలు తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్‌ పెంచికలపేట మండలంలో విజయవంతం అయింది. శనివారం మండలంలోని వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు బంద్‌ పాటించాయి. బీసీ సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో దుకాణాలను మూసి వేయించారు. దీంతో మండలంలో బంద్‌ ప్రశాంతంగా జరిగింది. ఎస్సై అనీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటన చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు.

తిర్యాణి, (ఆంధ్రజ్యోతి): బీసీలు తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్‌ తిర్యాణి మండలంలో విజయవంతం అయింది. మండలంలోని వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు బంద్‌ పాటించాయి. బీసీ సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో దుకాణాలను మూసి వేయించారు. ఎస్సై వెంకటేష్‌ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటన చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): బీసీలు తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్‌ చింతలమానేపల్లి మం డలంలో విజయవంతం అయింది. మండలంలోని వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు బంద్‌ పాటించాయి. బీసీ సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో దుకాణాలను మూసి వేయించారు. ఎస్సై సర్తాజ్‌ పాషా ఆధ్వర్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటన చోటు చేసుకోకుండా చూశారు.

రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): మండలంలోని అన్ని గ్రామాల్లో దుకాణాలను స్వచ్చందంగా బంద్‌ చేశారు. బంద్‌కు కాంగ్రెస్‌ నాయకుల మద్దతు తెలిపి రెబ్బెన నుంచి గోలేటి టౌన్‌ షిప్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పాఠశాలలు, వ్యాపార సముదాయాలు మూసి వేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్‌, దేవాజీ, సోమశేఖర్‌, గంటుమేర, కార్తీక్‌, మురళీ, మధునయ్య, కిషన్‌గౌడ్‌, రవీందర్‌, సాయి, సంజీవ్‌, సాయి, సుబ్బారావు, తిరుపతి, జాహిర్‌ బాబా, నాగేష్‌, కె.నాగేష్‌, శంకరన్న, మహేష్‌, సంతోష్‌, బాబు, రవీందర్‌, కూశన్న, రాజన్న, మల్లేష్‌, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

వాంకిడి, (ఆంద్రజ్యోతి): బీసీ జేఏసీ పిలుపు మేరకు శనివారం వాంకిడి మండలంలో బంద్‌ విజయవంతమైంది. ఉదయం నుంచే మండలంలో వ్యాపార సంస్థలు, పాఠశాలలు బంద్‌ పాటించాయి. బీఆర్‌ఎస్‌ నాయకులు నాయకులు మద్దతు పలికారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అజయ్‌కుమార్‌, తుకారాం, సుధాకర్‌, దీపక్‌, జయరాం తదితరులు పాల్గొన్నారు.

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండలంలో బంద్‌ విజయవంతం అయింది. ఉదయం నుండే మండలంలో వ్యాపార సంస్థలు, పాఠశాలలు బంద పాటించాయి. బంద్‌కు కాంగ్రెస్‌, బీజేపీ, మాలి సంఘం నాయకులు మద్దతు తెలిపారు. పోలీసు స్టేషన్‌ నుంచి నార్‌పల్లి చౌరస్తా వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మునీర్‌ అహ్మద్‌, వెంకటి నాయక్‌, శ్రీనివాస్‌, సుభాష్‌, తిరుపతి, ఆనంద్‌రావు తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(టి), (ఆంధ్రజ్యోతి): మండలంలో బంద్‌ విజయవంతం అయింది. మండలంలోని వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు బంద్‌ పాటించాయి. బీసీ సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో దుకాణాలను మూసి వేయించారు. దీంతో మండలంలో బంద్‌ ప్రశాంతంగా జరిగింది. ఎస్సై ఆధ్వర్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటన చోటు చేసుకోకుండా చూశారు.

కౌటాల, (ఆంధ్రజ్యోతి): బీసీలు తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్‌ శనివారం కౌటాల మండ లంలో విజయవంతం అయింది. మండలంలోని వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు బంద్‌ పాటించాయి. బీసీ సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో దుకాణాలను మూసి వేయించారు. దీంతో మండలంలో బంద్‌ ప్రశాంతంగా జరిగింది. ఎస్సై ఆధ్వర్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటన చోటు చేసుకోకుండా చూశారు.

Updated Date - Oct 18 , 2025 | 11:15 PM