BC Eeservations: బీసీ స్థానిక రిజర్వేషన్లకు అడ్డు బీజేపీనే
ABN , Publish Date - Sep 12 , 2025 | 04:33 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% కల్పించకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డు పడుతోందని రాష్ట్ర మంత్రులు...
మంత్రులు పొంగులేటి, వివేక్, వాకిటి, సీతక్క, సురేఖ
హైదరాబాద్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% కల్పించకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డు పడుతోందని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, సీతక్క మండి పడ్డారు. ఈ విషయంలో ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ నెల 15న కామారెడ్డిలో టీపీసీసీ ఆధ్వర్యంలో జరిగే బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ ఏర్పాట్లపై మంత్రి పొంగులేటి నివాసంలో వారు గురువారం సమీక్షించారు. ఈ సభకు జన సమీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కామారెడ్డి వేదికగా ఇచ్చిన కుల గణన హామీని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు చేశామన్న మంత్రులు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పనలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. కానీ, బీసీలకు రిజర్వేషన్ కల్పించకుండా బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కామారెడ్డి సభకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.