Ranchand Rao: రిజర్వేషన్ల పెంపును ఆమోదించేలా గవర్నర్‌ను ఒప్పించండి
ABN , Publish Date - Sep 30 , 2025 | 04:49 AM
బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఆమోదించేలా గవర్నర్‌ను ఒప్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ....
రాంచందర్‌రావును కోరిన బీసీ నేతలు
హైదరాబాద్, సెప్టెంబర్29(ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఆమోదించేలా గవర్నర్‌ను ఒప్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ బీజేపీని కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మరికొందరు నాయకులతో కలిసి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో భేటీ అయ్యారు. బీసీ రిజర్వేషన్ల పెంపును ఆమోదించేలా రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఒత్తిడి తీసుకురావాలంటూ ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు. అసెంబ్లీలో ప్రతిపాదించిన బిల్లుకు బీజేపీ మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. గవర్నర్ ఆమోదం లేకుండా జీవో నెంబర్ 9ని ఎలా జారీ చేశారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ను కలిసి నచ్చజెప్పాలని కోరారు.