BC Leaders Demand: బీసీ రిజర్వేషన్ల బాధ్యత కాంగ్రెస్, బీజేపీలదే
ABN , Publish Date - Dec 01 , 2025 | 05:33 AM
బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్, బీజేపీలదేనని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివా్‌సగౌడ్ అన్నారు...
8, 9 తేదీల్లో ఢిల్లీలో ఆందోళన: జాజుల
కవాడిగూడ, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్, బీజేపీలదేనని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివా్‌సగౌడ్ అన్నారు. ఈ విషయంలో మోసం చేసిన ఆ రెండు పార్టీలను ప్రధాన శత్రువులుగా బీసీ సమాజం పరిగణించాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఇందిరాపార్కు వద్ద బీసీల యుద్ధబేరి మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. డిసెంబరు 8, 9 తేదీలలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బీసీల రిజర్వేషన్ల సాధన కోసం ఆందోళన చేపడతామని ఆయన తెలిపారు. శాసనమండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి మాట్లాడుతూ.. బీసీలకు 42ు రిజర్వేషన్ల హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో మెజార్టీ ప్రజలదే రాజ్యాధికారమని, భారత్‌లో మాత్రం అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగిస్తూ బీసీలను అణగ దొక్కుతున్నారని ఆరోపించారు.