Share News

బీసీ సంఘాల రాస్తారోకో

ABN , Publish Date - Oct 10 , 2025 | 11:21 PM

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబీ చౌ రస్తా వద్ద బీసీ సమాజ్‌, బీసీ జేఏసీ ఆద్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.

బీసీ సంఘాల రాస్తారోకో
రాస్తారోకో నిర్వహిస్తున్న బీసీ సంఘాల నాయకులు

మంచిర్యాల క్రైం, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి) : బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబీ చౌ రస్తా వద్ద బీసీ సమాజ్‌, బీసీ జేఏసీ ఆద్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సమాజ్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్‌, జే ఏసీ జిల్లా అధ్యక్షుడు వడ్డెపల్లి మనోహర్‌ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా బీసీలకు రావాల్సిన హక్కులు రాకపోవడం వల్ల వెనుకబ డుతున్నారన్నారు. బీసీ ఉద్యమాల ఫలితంగా కాంగ్రెస్‌ గత ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని హామీ ఇచ్చిందన్నారు. బీసీలకు రి జర్వేషన్‌ కల్పిస్తూ జీవో తీసుకువచ్చారని, ఆ మేరకు స్థానిక సంస్థల్లో రిజ ర్వేషన్లు కల్పిస్తూ ముందుకు పోతున్న తరుణంలో అగ్రవర్ణాలైన రెడ్డిలు బీసీ లకు కల్పించిన జీవోకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లారని, కోర్టులో బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లు ఆపుతూ స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఆపారన్నా రు. ఈ తీర్పు బీసీ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందన్నారు. కాం గ్రెస్‌, టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు ఇప్పటికైనా మెజారిటీ ప్ర జలైన బీసీలకు అనుకూలంగా వ్యవహరించాలని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు హై కోర్టుకు బీసీ రిజర్వేషన్లపై అభిప్రాయం తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి లక్ష్మణ్‌, కర్నె శ్రీధర్‌, రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2025 | 11:21 PM