రేపు శ్రీరాంపూర్‌లో బతుకమ్మ సంబరాలు..
ABN , Publish Date - Sep 21 , 2025 | 11:35 PM
తెలంగాణ సంస్కృతి, సం ప్రదాయాలకు ప్రతిబింబం బతుకమ్మ సంబరాలు నస్పూర్ పట్టణం శ్రీరాంపూర్‌లోని ప్రగతి స్టేడియంలో ఈ నెల 23న నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన చారి తెలిపారు.
హాజరుకానున్న ఎమ్మెల్సీ కవిత
నస్పూర్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ సంస్కృతి, సం ప్రదాయాలకు ప్రతిబింబం బతుకమ్మ సంబరాలు నస్పూర్ పట్టణం శ్రీరాంపూర్‌లోని ప్రగతి స్టేడియంలో ఈ నెల 23న నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన చారి తెలిపారు. నస్పూర్ ప్రెస్ క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ జాగృతి, సింగరేణి జాగృతి, హెచ్‌ఎంఎస్ యూనియన్ సంయుక్తంగా బతుకమ్మ సంబరాలు నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 23న సాయంత్రం 5 గంటలకు శ్రీరాం పూర్‌లోని ప్రగతి స్టేడియంలో నిర్వహించే మహా బతుకమ్మ కార్యక్ర మానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత హాజరు కా నున్నరని పెర్కొన్నారు. దేశ,విదేశాల్లో తెలంగాణ సంస్కృతిని, బతుక మ్మ విశిష్టతను చాటి చెప్పి, తెలంగాణ ఉద్యమంలో ఉత్సహం, ప్రొ త్సాహం అందించిందన్నారు. శ్రీరాంపూర్‌లోని ప్రగతి స్టేడియం మైదా నంలో జరిగే మహా బతుకమ్మ వేడుకలకు హాజరవుతున్నారన్నారు. న స్పూర్, శ్రీరాంపూర్ ప్రాంతాల మహిళలు, కార్మికులు అధిక సంఖ్యలో హాజరు కావాలని నవీన చారి కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ జాగృతి, సింగరేణి జాగృతి నాయకులు సంపత్ గౌడ్, వెంకటేష్, ప్ర శాంత్, రత్నాకర్ రెడ్డి, వెంకటేశ్వర్ గౌడ్, మేడి శేఖర్, వంశీ, కందుల ప్రశాంత్, మౌనిక్, వినయ్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.