అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
ABN , Publish Date - Sep 30 , 2025 | 12:05 AM
సద్దుల బ తుకమ్మ సంబరాలు జిల్లాలో సోమవారం అంబరాన్నంటాయి. మహి ళలు తంగేడు, గునుగు, బంతి పూలతో బతుకమ్మలను తయారు చేసి గౌరమ్మను పూజించారు. ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములా యే చందమామ.. రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉ య్యాలో అంటూ మహిళలు సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.
మంచిర్యాల కలెక్టరేట్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : సద్దుల బ తుకమ్మ సంబరాలు జిల్లాలో సోమవారం అంబరాన్నంటాయి. మహి ళలు తంగేడు, గునుగు, బంతి పూలతో బతుకమ్మలను తయారు చేసి గౌరమ్మను పూజించారు. ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములా యే చందమామ.. రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉ య్యాలో అంటూ మహిళలు సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలు ఉదయం తీరొక్క పూలతో బతుకమ్మలను పే ర్చా రు. పసుపుతో గౌరమ్మను చేసి బతుకమ్మల్లో పెట్టి పూజలు చేసి నైవే ద్యాలను సమర్పించారు. రాత్రి ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలు పె ట్టి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. చిన్నారులు, యువతులు, మహి ళలు నృత్యాలు చేస్తూ సంబరాలను నిర్వహించారు. మహిళలందరు భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. అనంతరం ఒకరికి ఒకరు వాయినాలు ఇచ్చుకున్నారు. రాళ్లవాగు, గోదావరి నది, రా ముని చెరవులో బతుకమ్మలను నిమజ్జనంచేశాయి.