Share News

Amit Shah: డెడ్‌లైన్‌కు ముందే హిడ్మా ఎన్‌కౌంటర్‌

ABN , Publish Date - Nov 19 , 2025 | 04:52 AM

మావోయిస్టు పార్టీ అగ్రనేత, మిలిటరీ వ్యూహకర్త మాద్వి హిడ్మాను కేంద్ర హోం శాఖ అమిత్‌షా పెట్టిన డెడ్‌లైన్‌కు ముందే భద్రతాబలగాలు ఎన్‌కౌంటర్‌ చేసినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.....

Amit Shah: డెడ్‌లైన్‌కు ముందే హిడ్మా ఎన్‌కౌంటర్‌

  • ఈనెల 30లోపే పని ముగించాలన్న అమిత్‌షా

  • లొంగిపోతారా..పరిణామాలను ఎదుర్కొంటారా?

  • మావోయిస్టులకు మరోసారి బస్తర్‌ ఐజీ హెచ్చరిక

న్యూఢిల్లీ, నవంబరు 18 : మావోయిస్టు పార్టీ అగ్రనేత, మిలిటరీ వ్యూహకర్త మాద్వి హిడ్మాను కేంద్ర హోం శాఖ అమిత్‌షా పెట్టిన డెడ్‌లైన్‌కు ముందే భద్రతాబలగాలు ఎన్‌కౌంటర్‌ చేసినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 30వ తేదీ లోపు హిడ్మా పని ముగించాలని అమిత్‌షా ఆదేశించినట్టు సమాచారం. అయితే, ఆ తేదీకి ముందే భద్రతాబలగాలు తమ లక్ష్యాన్ని ఛేదించాయని తెలిసింది. హిడ్మా ఎన్‌కౌంటర్‌ విషయం తెలియగానే అమిత్‌షా ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించిన ఉన్నతస్థాయి అధికారులతో మాట్లాడారు. కాగా, హిడ్మా ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో, మావోయిస్టులకు ఛత్తీ్‌సగఢ్‌లోని బస్తర్‌ ఐజీ సుందర్‌రాజ్‌ మరోసారి హెచ్చరికలు జారీచేశారు. లొంగిపోవడం లేదా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవడం తప్ప మావోయిస్టులకు మరోదారి లేదని స్పష్టంచేశారు. హిడ్మా మృతితో ఒక్క బస్తర్‌లోనే కాకుండా మొత్తం భారతదేశ వ్యాప్తంగా భద్రతా బలగాలు నిర్ణయాత్మక ముందంజను సాధించాయని తెలిపారు.

Updated Date - Nov 19 , 2025 | 04:52 AM