kumaram bheem asifabad- బెంబేలెత్తిస్తున్న శునకాలు
ABN , Publish Date - Nov 08 , 2025 | 10:38 PM
కాగజ్‌నగర్ పట్టణంలోని ఆయా కాలనీల్లో ప్రజలను శునకాలు బెంబేలెత్తిస్తున్నాయి. గుంపులుగా గుంపులుగా రాత్రి వేళల్లో ఎక్కువగా తిరుగుతూ ఉండడంతో పట్టణ వాసులు భయాందోళన చెందుతు న్నారు. పలు కాలనీల్లో చిన్న పిల్లలు, వృద్ధులు, పశువులపై దాడులు చేస్తున్నాయి. రోడ్లపై వెళ్లే వాహన దారులు, పాదచారుల వెంటపడి తరుముతూ గాయపరుస్తున్నాయి. వీధుల్లో శునకాలు స్వైర విహారం చేస్తున్నాయని ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ సిబ్బంది పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
కాగజ్‌నగర్ టౌన్, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ పట్టణంలోని ఆయా కాలనీల్లో ప్రజలను శునకాలు బెంబేలెత్తిస్తున్నాయి. గుంపులుగా గుంపులుగా రాత్రి వేళల్లో ఎక్కువగా తిరుగుతూ ఉండడంతో పట్టణ వాసులు భయాందోళన చెందుతు న్నారు. పలు కాలనీల్లో చిన్న పిల్లలు, వృద్ధులు, పశువులపై దాడులు చేస్తున్నాయి. రోడ్లపై వెళ్లే వాహన దారులు, పాదచారుల వెంటపడి తరుముతూ గాయపరుస్తున్నాయి. వీధుల్లో శునకాలు స్వైర విహారం చేస్తున్నాయని ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ సిబ్బంది పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఏడాది క్రితం ఒకే రోజు 10 మందికి పై దాడి చేయడంతో గాయాలు అయ్యాయి. వీధి కుక్కల బెడదను నివారించేందుకు వాటికి నియంత్రణ ఆపరేషన్లు చేసేవారు. ప్రస్తుతం ఆపరేషన్లు, లేదా పట్టుకునేందుకు ప్రణాళికలు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో కుక్కల సమస్య తీవ్ర రూపం దాల్చింది. రాత్రి వేళల్లో ఆయా కాలనీల్లో గుంపులు గుంపులు తిరుగుతుండడంతో ప్రజలు బెంబెతెత్తుతున్నారు. కాలనీల్లో కుక్కల బెడద అధికం కావడంతో పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. రాత్రి వేళల్లో కొత్త వారు వస్తే వారి వెంట పడి పరుగులు తీయిస్తున్నాయి. గతంలో ఎన్నో సంఘటనలు జరిగినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని పట్టణ వాసులు ఆరోపిస్తున్నారు. ఏ కాలనీలో చూసినా గుంపులు, గుంపులుగా కుక్కలు సంచరిస్తూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు, సిబ్బంది వీధి కుక్కల బెడద నుంచి కాపాడాలని పట్టణవాసులు కోరుతున్నారు.