kumaram bheem asifabad- బ్యాంకర్లు రుణ లక్ష్యం సాధించాలి
ABN , Publish Date - Nov 27 , 2025 | 10:24 PM
బ్యాంకర్లు 2025-26 వార్షిక సంవత్సరం రుణ లక్ష్య సాధనలో పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట భవన సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన వార్షిక సంవత్సరం రెండో త్రైమాసిక సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాజేశ్వర్ జోషి, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్‌డీఎం శ్రీనివాస్, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ రితీష్‌కుమార్ గుప్తా, నాబార్డు డీడీఎం వీరభద్రుడు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావులతో కలిసి హాజరై బ్యాంకుల వారీగా రుణాలు, బ్యాంకు లింకేజీ, వ్యవసాయ ఆధారిత రుణాలు, పంట రుణాలు, గృహ నిర్మాణ రుణాలు, విద్యా రుణాలపై సమీక్ష నిర్వహించారు
ఆసిఫాబాద్, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): బ్యాంకర్లు 2025-26 వార్షిక సంవత్సరం రుణ లక్ష్య సాధనలో పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట భవన సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన వార్షిక సంవత్సరం రెండో త్రైమాసిక సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాజేశ్వర్ జోషి, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్‌డీఎం శ్రీనివాస్, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ రితీష్‌కుమార్ గుప్తా, నాబార్డు డీడీఎం వీరభద్రుడు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావులతో కలిసి హాజరై బ్యాంకుల వారీగా రుణాలు, బ్యాంకు లింకేజీ, వ్యవసాయ ఆధారిత రుణాలు, పంట రుణాలు, గృహ నిర్మాణ రుణాలు, విద్యా రుణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకర్లు నిర్దేశిత రుణ లక్ష్యాలను సాధించేందుకు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ముద్ర రుణాలు, ఆధార్ అనుసంధానం, బాయంకు లికేంజీలు, ఎస్‌సీ రుణాలు, ట్రైకార్ రుణ లక్ష్యాన్ని సాధించాలని తెలిపారు. వ్యవసాయా అధారిత యంత్రాలు, సోలార పెన్షింగ్ లాంటి వాటిపై రైతులకు రుణాలు అందించి ప్రోత్సహించాలని, గృహ నిఆ్మణాల రుణాల పురోగతిని సాధించానలి, స్వయం సహయక సంఘాల అభివృద్ధికి రుణ మంజూరు చేసి ఆర్థిక బలోపేతానికి కృషి చేయాలని చెప్పారు. డపీఎంలు, ఏపీఎంలు, బ్యాంకు అధికారులను సంప్రదించి రుణ లక్ష్యాలు పూర్తి స్థాయిలో సాధించేలా సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారి రమాదేవి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ అశోక్, మెప్మా పీడీ మోతిరాం, సెర్ప్ డీపీఎంలు, ఏపీఎంలు, బ్యాంకు మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.
మీడియా సెంటర్ ప్రారంభం
ఆసిఫాబాద్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మీడియా సెంటర్ ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో కంట్రోల్ రూంలో మీడియా సెంటర్‌ను గ్రామ పంచాయతీ ఎన్నికల సాదారణ పరిశీలకులు వి శ్రీనివాస్, వ్యయ పరిశీలకులు స్వప్న, ్లఅదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి గురువారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడు విడతలుగా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. తొలి విడతలో ఐదు మండలాలు 27 కేంద్రాలలో నామినేషన్ స్వీకరించనున్నామని చెప్పారు. జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు 2,874 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని అన్నారు. మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీల ద్వారా ప్రతికలలో, టీవీలలో వచ్చే చెల్లింపు వార్తలు, వార్త కథనాలు, ప్రకటనలపై, సోషల్ మీడియా ప్రచారంపై నిఘా ఉంటుందని తెలిపారు. స్థానిక సంస్థలలో సమాచారం కోసం కంట్రోల్ రూం హెల్ప్ లైన నంబర్ 8500844365ని సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, డీపీఆర్‌వో సంపత్‌కుమార్, డీపీవో భిక్షపతి, జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణపాల్గొన్నారు