Bandi Sanjay Warns: ప్రజాస్వామ్యం గురించి ఉపన్యాసాలిస్తూ మావోయిస్టులతో సంబంధాలా?
ABN , Publish Date - Oct 20 , 2025 | 04:20 AM
ఒకవైపు ప్రజాస్వామ్యం గురించి వేదికలపై ఉపన్యాసాలిస్తూ మరోవైపు మావోయిస్టులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న...
వాటిని తెంచుకోకపోతే పేర్లు వెల్లడించక తప్పదు
తెలంగాణలో కొందరు ప్రజాప్రతినిధులకు బండి హెచ్చరిక
హైదరాబాద్/న్యూఢిల్లీ, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): ఒకవైపు ప్రజాస్వామ్యం గురించి వేదికలపై ఉపన్యాసాలిస్తూ మరోవైపు మావోయిస్టులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న తెలంగాణ ప్రజాప్రతినిధులు తక్షణం ఆ సంబంధాలను తెంచుకోవాలని, లేని పక్షంలో సదరు ప్రజాప్రతినిధుల వివరాలు వెల్లడించక తప్పదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో, హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు కేవలం మావోయిస్టుల నిర్మూలనకే పరిమితం కావడం లేదని, అవినీతి, నేరాలు, తీవ్రవాద సంబంధాల నెట్‌వర్క్‌ను సైతం వెలికితీస్తున్నాయని చెప్పారు. కొంతమంది నక్సల్స్ తెలంగాణ ప్రజాప్రతినిధులకు విధేయులుగా వ్యవహరిస్తున్నారంటూ మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజాప్రతినిధులకు సంజయ్ హెచ్చరిక జారీ చేశారు. ఇదిలా ఉండగా, బండి సంజయ్ ఢిల్లీలో తన శాఖ కార్యాలయాన్ని ‘కర్తవ్య భవన్’ లోకి మార్చారు. దీపావళి సందర్భంగా సంజయ్ ఆదివారం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య తన చాంబర్‌లోకి అడుగుపెట్టారు.