Share News

Bandi Sanjay Challenges KTR: కేటీఆర్‌.. ప్రమాణం చెయ్‌

ABN , Publish Date - Nov 10 , 2025 | 03:23 AM

కేటీఆర్‌.. ఎన్నడూ డ్రగ్‌ ్స తీసుకోలేదని, తీసుకోనని కుటుంబ సమేతంగా భాగ్యలక్ష్మీ అమ్మవారి వద్ద తడిబట్టలతో ప్రమాణం చేసే దమ్ముందా....

Bandi Sanjay Challenges KTR: కేటీఆర్‌.. ప్రమాణం చెయ్‌

  • ఎప్పుడూ డ్రగ్స్‌ తీసుకోలేదని.. భాగ్యలక్ష్మీ అమ్మవారి వద్దకు వచ్చి ఒట్టు వెయ్యి కేటీఆర్‌కు బండి సంజయ్‌ సవాల్‌

హైదరాబాద్‌ సిటీ/యూసు్‌ఫగూడ, హైదరాబాద్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ‘‘కేటీఆర్‌.. ఎన్నడూ డ్రగ్‌ ్స తీసుకోలేదని, తీసుకోనని కుటుంబ సమేతంగా భాగ్యలక్ష్మీ అమ్మవారి వద్ద తడిబట్టలతో ప్రమాణం చేసే దమ్ముందా? సోమవారం ఉదయంలోపు ప్రమాణం చెయ్‌’’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సవాల్‌ చేశారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన పాదయాత్ర చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘అయ్య పేరు చెప్పి గెలిచిన బతుకు కేటీఆర్‌ది.. కేసీఆర్‌ లేకుంటే ఆయనను కుక్కలు కూడా చూడవు’’ అని మండిపడ్డారు. విర్రవీగిన కేసీఆర్‌ మెడలు వంచింది బీజేపీయేనని, కాంగ్రెస్‌ మెడలు వంచి అధికారంలో నుండి దింపేది కూడా బీజేపీయేనని ఆయన వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కలిసి డబ్బులు పంచుతున్నాయని.. కాంగ్రెస్‌ రూ.7 వేలు ఇస్తే, బీఆర్‌ఎస్‌ రూ.5 వేలు పంచుతోందని ఆరోపించారు. ‘‘డబ్బులు తీసుకోండి... పువ్వు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలకు బుద్ధి చెప్పండి’’ అని పిలుపునిచ్చారు. హిందువుల ఓట్లు అవసరం లేదన్నట్లుగా ముఖ్యమంత్రే మాట్లాడుతున్నారంటే ఏమనాలని ప్రశ్నించారు. బీజేపీ 80 శాతం మంది హిందువుల పక్షాన పోరాడుతోందని గుర్తుచేశారు. మాగంటి గోపీనాథ్‌ జూన్‌ 8న చనిపోతే.. ఆయన తల్లి అదే నెల 25న పోలీసులకు ఫిర్యాదు చేశారని.. అయినా ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. గోపీనాథ్‌ కుమారుణ్ని ఇండియాకు రావొద్దంటూ మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌ బెదిరించారని దుయ్యబట్టారు. మాగంటి సునీతకు రెండు ఓటర్‌ కార్డులున్నాయని.. ఒక ఓటర్‌ కార్డులో సునీత భర్త పేరు సునీత మనోహర్‌ అని ఉందని.. ఇంకో ఓటర్‌ కార్డులో సునీత భర్త పేరు మాగంటి గోపీనాథ్‌ అని ఉందని ఆరోపించారు. ఆ ఓటర్‌ కార్డులను తాను ప్రభుత్వానికి పంపిస్తున్నానని.. దీనిపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. 2023 ఎన్నికల అఫిడవిట్‌లో మాగంటి సునీత తాను చదువుకోలేదని రాసిచ్చారని, 2025 ఎన్నికల అఫిడవిట్‌లో పదోతరగతి వరకు చదువుకున్నారని రాసిచ్చారని.. దీనిపైనా విచారణ జరపాలని డిమాండ్‌చేశారు. గోపీనాథ్‌ ఆస్తులను కాజేసేందుకు సునీతతో కలిసి కేటీఆర్‌ కుట్ర చేస్తున్నారని.. ఆ ఆధారాలను, తన దగ్గరున్న సమాచారాన్ని పోలీసులకు పంపించానని తెలిపారు.


పాతబస్తీలో హిందూ బాలికలపై డ్రగ్స్‌ పంజా

పాతబస్తీలో డ్రగ్స్‌ రాకెట్‌ ముఠా అరాచకాలకు వందలాది మంది హిందూ బాలికలు బలవుతున్నారని.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిల్‌ అలియాస్‌ అజీజ్‌ ఆ ముఠాకు లీడర్‌ అని.. దాంట్లో 40 మంది ముస్లిం యువకులు ఉన్నారని ఆయన ఆరోపించారు. మజ్లిస్‌ నాయకులు, కొంతమంది పోలీసు అధికారుల అండదండలతో ఆ ముఠా హిందూ బాలికలను డ్రగ్స్‌కు బానిసలుగా చేసి వారిని శారీరకంగా దోపిడీ చేస్తోందని, వారిపై అత్యాచారం చేసి, వీడియోలు తీసి వాటిని చూపి బ్లాక్‌మెయిల్‌ చేస్తూ వారి జీవితాలను సర్వనాశనం చేస్తోందని మండిపడ్డారు. ‘ఒక బాలికను ట్రాప్‌ చేసి డ్రగ్స్‌కు అలవాటు చేసే ఈ గ్యాంగ్‌, వారు ఎవరిని కావాలనుకుంటే వారిని తీసుకువచ్చే భారం కూడా ఆ బాలికపైనే పెడుతున్నారు. ఇలా తానే 9 మందిని తీసుకువెళ్లినట్లు ఒక బాధితురాలు వెల్లడించింది’ అని ఆవేదన వెలిబుచ్చారు. బాధిత బాలికల తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లకు వెళితే కనీసం ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయడం లేదన్నారు. ‘‘వందలాది మంది మైనర్‌ బాలికలు అదృశ్యమవుతుంటే మీ నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది’’ అని నిలదీశారు. ఈ దారుణాలు తట్టుకోలేక వందలాది బెంగాలీ హిందూ కుటుంబాలు వెళ్లిపోయాయని, కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ‘‘పాతబస్తీని కాపాడడం చేతగాకపోతే చెప్పండి.. చట్టానికి లోబడి కేంద్ర బలగాలను దింపుతాం.. హిందువులను మేం రక్షించుకుంటాం’’ అన్నారు. ఈ దారుణాలపై సీఎం తక్షణం స్పందిచకపోతే బీజేపీ హిందూ రక్షక దళాలను ఏర్పాటుచేసి కవాతు నిర్వహిస్తుందని హెచ్చరించారు. ఈ దారుణాలపై నిబద్ధత గల అధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. నిందితులకు మద్దతుగా ఉన్న పోలీసు అధికారులపై కేసులు నమోదు చేయాలని కోరారు.

Updated Date - Nov 10 , 2025 | 03:23 AM