Union Minister Bandi Sanjay: శ్రీనగర్‌లో బండి సంజయ్ పర్యటన
ABN , Publish Date - Oct 17 , 2025 | 02:10 AM
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో నిర్వహించిన ఆలిండియా పోలీస్ జూడో క్లస్టర్ ముగింపు..
పోలీస్ జూడో క్లస్టర్ ముగింపు ఉత్సవాలకు హాజరు
హైదరాబాద్, శ్రీనగర్, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో నిర్వహించిన ఆలిండియా పోలీస్ జూడో క్లస్టర్ ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గతంలో తెలంగాణలో పనిచేసి ప్రస్తుతం జమ్మూకశ్మీర్ డీజీపీగా కొనసాగుతున్న నళిన్ ప్రభాత్ సహా ఉన్నతాధికారులు శ్రీనగర్ ఎయిర్ పోర్టులో కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు. అన్ని రాష్ర్టాల పోలీస్, కేంద్ర పారామిలటరీ సిబ్బంది పాల్గొన్న ఈ క్రీడల్లో అత్యుత్తమ కనబరిచిన క్రీడాకారులకు మంత్రి బహుమతులను ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని ప్రతీస్థాయిలో విస్తరించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని బండి సంజయ్ తెలిపారు. ముఖ్యంగా పోలీసు, పారామిలిటరీ సిబ్బందిలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ‘‘ఖేలో ఇండియా’’, ‘‘ఫిట్ ఇండియా మూవ్‌మెంట్’’ వంటి జాతీయ కార్యక్రమాలను నిర్వహిస్తోందని చెప్పారు.