Share News

Bandi Sanjay Alleges: కేటీఆర్‌ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు

ABN , Publish Date - Sep 16 , 2025 | 05:14 AM

పరువు నష్టం దావాతో తనను బెదిరించేందుకు కేటీఆర్‌ ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. దానిని తాను న్యాయపరంగా...

Bandi Sanjay Alleges: కేటీఆర్‌ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు

  • న్యాయపరంగా ఎదుర్కొంటా: సంజయ్‌

కరీంనగర్‌ అర్బన్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): పరువు నష్టం దావాతో తనను బెదిరించేందుకు కేటీఆర్‌ ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. దానిని తాను న్యాయపరంగా, రాజకీయంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. కరీంనగర్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను తొమ్మిది సార్లు జైలుకు వెళ్లి వచ్చానని, వందకుపైగా కేసులు ఎదుర్కొంటున్నానని తెలిపారు. కేటీఆర్‌ లాగా ఇజ్జత్‌ దావా వేయాలంటే తాము అనేక కేసులు వేయవచ్చన్నారు. తంబాకు తింటున్నానంటూ తనపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఈ అంశంపై ప్రమాణం చేసేందుకు దేవుడి సన్నిధికి రావాలన్న తన సవాల్‌ను కేటీఆర్‌ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.

Updated Date - Sep 16 , 2025 | 05:14 AM