Share News

Bandi Sanjay Accuses Rahul Gandhi : ప్రజల జీవితాలతో కాంగ్రెస్‌ రాజకీయ ఫుట్‌బాల్‌

ABN , Publish Date - Dec 15 , 2025 | 04:22 AM

రాష్ట్ర ప్రజల జీవితాలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆడుతున్న రాజకీయ ఫుట్‌బాల్‌.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీకి కనిపించడం లేదని...

Bandi Sanjay Accuses Rahul Gandhi : ప్రజల జీవితాలతో కాంగ్రెస్‌ రాజకీయ ఫుట్‌బాల్‌

  • ఇది రాహుల్‌కు కనిపించడం లేదు: బండి సంజయ్‌

హైదరాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజల జీవితాలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆడుతున్న రాజకీయ ఫుట్‌బాల్‌.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీకి కనిపించడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఇబ్బందుల కంటే మెస్సీయే రాహుల్‌కు ప్రాధాన్యమయ్యారని విమర్శించారు. హైదరాబాద్‌లో మెస్సీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు రాహుల్‌ హాజరుకావడంపై ‘ఎక్స్‌’ వేదికగా సంజయ్‌ స్పందించారు. ‘‘మీరు ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూడటానికి వచ్చారు.. కానీ మీ ప్రభుత్వం రాష్ట్రంలో పేదల ఇళ్లు కూల్చివేస్తోంది. కలుషిత ఆహారంతో విద్యార్థులుచనిపోతున్నారు. దారుణ హత్యలు జరుగుతున్నాయి. దేవాలయాలను కూల్చివేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే నిమిషంలో ఇక్కడ ఉంటానని ఎన్నికల ముందు చెప్పారు. కానీ, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు గైర్హాజరవుతారు. అల్లర్లు జరిగినప్పుడు విహారయాత్రలో ఉంటారు’’ అని విమర్శించారు.

Updated Date - Dec 15 , 2025 | 04:22 AM