Minister Adluri Lakshman: డ్రగ్స్‌కు దూరంగా ఉండండి
ABN , Publish Date - Nov 19 , 2025 | 05:02 AM
విద్యార్థులు, యువకులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, సరదాలతో మొదలయ్యే చెడు అలవాట్లు జీవితాన్ని నాశనం చేస్తాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు....
చెడు అలవాట్లు జీవితాన్ని నాశనం చేస్తాయి: మంత్రి అడ్లూరి
హైదరాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు, యువకులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, సరదాలతో మొదలయ్యే చెడు అలవాట్లు జీవితాన్ని నాశనం చేస్తాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. పిల్లలపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారని, వాళ్ల గురించి ఆలోచించాలని, యువకులు తప్పుదారి పట్టొద్దని సూచించారు. ‘డ్రగ్స్‌కు దూరంగా.. జీవిత లక్ష్యాలకు దగ్గరగా’ అనే సందేశాన్ని ప్రతి విద్యార్థి, యువకుడి వద్దకు చేరేలా అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం గాంధీ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ 5వ వార్షికోత్సవంలో పాల్గొన్న మంత్రి అడ్లూరి మాట్లాడారు. తెలంగాణను మత్తు పదార్థాల బారి నుంచి బయటపడే రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరాను నిర్మూలించడానికి ఈగల్ స్పెషల్ యూనిట్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.