బహుజన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్‌రామ్
ABN , Publish Date - Apr 05 , 2025 | 11:13 PM
బహుజన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్‌రామ్ అ ని, ఆయన జీవితం అందరికి ఆదర్శనీయమని కలె క్టర్ కుమార్ దీపక్ అన్నారు.

కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి) : బహుజన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్‌రామ్ అ ని, ఆయన జీవితం అందరికి ఆదర్శనీయమని కలె క్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవన సమావేశ మందిరంలో బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకల్లో క లెక్టర్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ని వాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్వాతం త్య్ర సమర యోధుడు, దళితుల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేసిన మహానీయుడు జగ్జీవన్ రామ్ అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పో టు రవీందర్‌రెడ్డి, దుర్గా ప్రసాద్, కిసన్, రౌఫ్‌ఖాన్, వెంకటేశ్వర్‌రావు, రాజేశ్వరి పాల్గొన్నారు.
జగ్జీవన్‌రామ్ సేవలు చిరస్మరణీయం
మంచిర్యాల క్రైం: భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీ వన్‌రామ్ సేవలు చిరస్మరణీయమని రా మగుండం సీపీ అంబర్ కిషోర్‌ఝా అన్నారు. శని వారం కమిషనరేట్ కార్యాల యంలో ఘనంగా జ యంతి వేడుకలు నిర్వహించారు. భార తదేశ స్వా తంత్య్ర ఉద్యమంలోను స్వరాజ్యం వచ్చాక ఆధునిక భారతదేశ నిర్మాణంలోను స్పూర్తివంత మైన సేవ లందించారన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాం చి ఏసీపీ రాఘవేం ద్రరావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఇన్స్‌పెక్టర్లు సతీష్, ప్రేమ్, శ్రీని వాస్, ఆర్‌ఐలు దామోదర్, శ్రీనివాస్, మల్లేశం పాల్గొన్నారు.
ఫమంచిర్యాల కార్పొరేషన్ కాంట్రాక్టు కార్మిక సం ఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ జ యంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాయకులు సుదమల్ల హరిక్రిష్ణ, సంఘం అధ్యక్షులు గోవర్ల ఆశయ్య, బూడిద శ్యామ్, లింగ య్య, ఆత్మకూరి తిరుపతి, శ్రీనివాస్, సత్తయ్య పాల్గొన్నారు.ఙ