Share News

Azim Premji Scholarship: బాలికల ఉన్నత విద్యకు అజీమ్‌ ప్రేమ్‌జీ స్కాలర్‌షిప్‌

ABN , Publish Date - Sep 24 , 2025 | 04:01 AM

ఉన్నత విద్యలో బాలికలను ప్రోత్సహించడానికి అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ ప్రత్యేక స్కాలర్‌షిప్‌ పథకాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన...

Azim Premji Scholarship: బాలికల ఉన్నత విద్యకు అజీమ్‌ ప్రేమ్‌జీ స్కాలర్‌షిప్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యలో బాలికలను ప్రోత్సహించడానికి అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ ప్రత్యేక స్కాలర్‌షిప్‌ పథకాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన గోడపత్రికను తెలంగాణ ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య బాలకిష్టారెడ్డి, కార్యదర్శి శ్రీరాం వెంకటేష్‌ మంగళవారం తమ కార్యాలయంలో విడుదల చేశారు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా పాఠశాల, జూనియర్‌ కాలేజీల్లోనే చదివి ఉండాలి. ఈ కార్యక్రమం ద్వారా 15వేల మంది బాలికలకు డిగ్రీ పూర్తయ్యేంతవరకు ఏడాదికి రూ.30వేల స్కాలర్‌షిప్‌ ఉంటుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని బాలకిష్టారెడ్డి కోరారు. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ డాట్‌ ఆర్గ్‌ వెబ్‌సైట్‌ ద్వారా స్వీకరిస్తామని ఫౌండేషన్‌ ప్రతినిధులు తెలిపారు.

Updated Date - Sep 24 , 2025 | 04:01 AM