Share News

వైభవంగా అయ్యప్ప మండల మహా పడిపూజ

ABN , Publish Date - Dec 27 , 2025 | 10:42 PM

మండలంలోని గూడెంగుట్ట లో ని అయ్యప్ప మందిరమును శనివారం అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి మహామండల పడిపూజ వైభవోపేతంగా జరిగింది.

వైభవంగా అయ్యప్ప మండల మహా పడిపూజ

పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

దండేపల్లి డిసెంబరు27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గూడెంగుట్ట లో ని అయ్యప్ప మందిరమును శనివారం అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి మహామండల పడిపూజ వైభవోపేతంగా జరిగింది. ఆలయంలో ఉ దయం నుంచి స్వామివారికి సుప్రభాతసేవ, పంచామృత అభిషేకం, అలం కరణ, హారతి, మంత్రపుష్పం ఆలయ వ్యవస్థాపకులు, గురుస్వామి చక్రవర్తుల పురుషోత్తమాచారులు ఆధ్వర్యంలో వేదపండితులు రజినేష్‌శర్మ వేద మంత్రోచరణల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప మందిరం దీక్షాపరులు, భక్తుల తో నిండిపోయింది. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవస్థానంలో ఆధ్వర్యంలో స్వామి తీర్థ ప్రసాదాలతో పాటు అ న్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అభినవ శబరిమ లై అయ్యప్ప స్వామి సేవ సమితిసభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2025 | 10:42 PM